అన్వేషించండి

Amrit Bharat Stations: ఆగస్టు 6న తెలంగాణకు ప్రధాని, అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపికైన స్టేషన్లలో పనుల ప్రారంభం

Amrit Bharat Stations: అమృత్ భారత్ పథకంలో భాగంగా తెలంగాణలో ఎంపిక చేసిన స్టేషన్లలో పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆగస్టు 6న రాష్ట్రానికి రానున్నారు.

Amrit Bharat Stations: దేశంలోని రైల్వే స్టేషన్లను నవీకరించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అమృత్ భారత్ పథకంలో భాగంగా తెలంగాణలో 39 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా అధునాతన సౌకర్యాలు కల్పించడం లాంటి పనులు చేపడతారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రక్రియలో భాగంగా.. తెలంగాణలో మొత్తం 39 స్టేషన్లను గుర్తించి వాటిని ఆధునికీకరించనున్నారు. మొదటి విడతలో తెలంగాణ నుంచి 21 స్టేషన్లకు సంబంధించిన పనులను ఆగస్టు 6వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇందుకోసం మోదీ తెలంగాణకు విచ్చేయనున్నారు.

Amrit Bharat Stations: అమృత్ భారత్ పథకంలో ఏమేం చేస్తారంటే..

అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, స్టేషన్లలో స్వచ్ఛత ఉండేలా చూడటం, ప్రయాణికుల వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు ఉచితి వైఫై వంటి సదుపాయాలు కల్పిస్తారు. స్థానిక ఉత్పత్తులకు సరైన గుర్తింపు కల్పించేందుకు వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ షాపులు, ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్ లు, స్టేషన్ ముందు, వెనకా మొక్కల పెంపకం, చిన్న చిన్న గార్డెన్లు వంటివి కూడా ఏర్పాటు చేస్తారు. అవసరమైన నిర్మాణాలు చేపడతారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సుస్థిర-పర్యావరణ అనుకూల పరిష్కారాలతో పనులు చేపట్టడం, పట్టాలకు ఇరువైపులా కాంక్రీట్ ఫుట్ పాత్ లు, రూఫ్ ప్లాజాలు కూడా నిర్మిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో వచ్చే 40 ఏళ్ల అవసరాలు తీర్చేలా తీర్చిదిద్దేందుకు రూ.715 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే చర్లపల్లి టర్మినల్ అభివృద్ధికి రూ.221 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 

Also Read: TSRTC T24 Ticket Price: ఉద్యోగులకు శుభవార్త- ప్రయాణికులకు వాత, టికెట్ ధరలు పెంచిన టీఎస్ఆర్టీసీ

మొదటి విడతలో ఎంపికైన 21 స్టేషన్లు

  • హైదరాబాద్ (నాంపల్లి) - రూ.309 కోట్లు
  • హైదరాబాద్ (మలక్ పేట్) - రూ. 27.6 కోట్లు
  • హైదరాబాద్ (మేడ్చల్) - రూ.27.6 కోట్లు
  • హైదరాబాద్ (ఉప్పుగూడ) - రూ.26.8 కోట్లు
  • హైదరాబాద్ (హఫీజ్ పేట) - రూ. 26.6 కోట్లు
  • హైదరాబాద్ (హైటెక్ సిటీ) - రూ.26.6 కోట్లు 
  • నిజామాబాద్ - రూ.53.3 కోట్లు
  • కరీంనగర్ - రూ. 26.6 కోట్లు
  • కామారెడ్డి - రూ.39.9 కోట్లు
  • మహబూబ్ నగర్ - రూ.39.9 కోట్లు
  • మహబూబాబాద్ - రూ. 39.7 కోట్లు
  • రామగుండం(పెద్దపల్లి) - రూ.26.5 కోట్లు
  • ఖమ్మం - రూ.25.4 కోట్లు
  • మధిర (ఖమ్మం) - రూ.25.4 కోట్లు
  • జనగామ - రూ. 24.5 కోట్లు
  • యాదాద్రి - రూ.24.5 కోట్లు
  • కాజీపేట జంక్షన్ - రూ. 24.5 కోట్లు
  • తాండూర్ (వికారాబాద్) - రూ. 24.4 కోట్లు
  • భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) - రూ. 24.4 కోట్లు
  • జహీరాబాద్ (సంగారెడ్డి) - రూ.24.4 కోట్లు
  • ఆదిలాబాద్ - రూ. 17.8 కోట్లు

ఈ 21 స్టేషన్ల అభివృద్ధికి మొత్తం రూ. 894 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులు ఆగస్టు 6వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

Also Read: NIA Arrests: హైదరాబాద్, భోపాల్‌లో ఉగ్ర చర్యలకు కుట్ర - మొత్తం 17 మంది అరెస్టు

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget