MLC Patnam Sorry To Police : పోలీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క్షమాపణలు - "పట్నం" తీరుపై హైకమాండ్ ఆగ్రహం !
ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తీరుపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయన పోలీసులకు క్షమాపణలు చెప్పారు.
పోలీసుల్ని తీవ్రంగా దూషించిన ఘటనలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. టీఆర్ఎస్ హైకమాండ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉదయం కూడా తన మాటలకు కట్టుబడి ఉన్నానని ఓసారి.. ఆ ఆడియో టేప్ తనది కాదని మరోసారి ప్రకటించినా చివరికి క్షమాపణలు కతోరారు.
పోలీసుల మనస్సు నొప్పిస్తే అది తనకు బాధకరంగా ఉంటుందన్నారు. పోలీసు సోదరులంతా తన కుటుంబ సభ్యులతో సమానమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధి, శాంతిభద్రతల్లో వారి కృషి అభినందనీయమన్నారు. నిన్నటి నుండి విస్తృతంగా ప్రచారం అవుతున్న ఆడియో క్లిప్ లు ఆవేశంగా మాట్లాడిన నేపథ్యంలో పొరపాటున నోరుజారి కొంత మంది మిత్రులు, పోలీసులు భాధపడితే తాను తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీసులంటే తనకు ఎనలేని గౌరవమని చెప్పారు.
అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే - రెండో అతి పెద్ద గూగుల్ క్యాంపస్ మన దగ్గరే !అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే - రెండో అతి పెద్ద గూగుల్ క్యాంపస్ మన దగ్గరే !
తాండూరు నియోజకవర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి…తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిల మధ్య వార్ కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. స్థానిక ఎమ్మెల్యేగా ఆయనకు ప్రాధాన్యం దక్కుతోంది. దీంతో మహేందర్ రెడ్డి అసంతృప్తికి గురవుతున్నారు. పార్టీ క్యాడర్
ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గం….ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గాలుగా విడిపోయారు. అధికారులు కూడా ఎమ్మెల్యే చెప్పిన మాటే వింటూండటంతో పట్నం మహేందర్ రెడ్డి అసహనానికి గురవుతున్నారు.
చేసేది పోలీస్ ఉద్యోగం- చేసింది కూతురిపై అత్యాచారం ! ఇతనికేంటి శిక్ష ?
ఎన్నికల వేడి పెరుగుతూండటంతో ఇరు వర్గాలు తమ కార్యకలాపాలు పెంచాయి. వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో తాండూరు టికెట్టు తనకే వస్తుందని ఇద్దరు నేతలు నమ్మకంతో ఉన్నారు. పార్టీలో చేరిన సమయంలో వచ్చే ఎన్నికల్లో టికెట్టు ఇస్తామని హామి ఇచ్చారని పైలట్ రోహిత్ రెడ్డి చెబుతున్నారు. మహేందర్‌రెడ్డి…రోహిత్‌రెడ్డిల మధ్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నా పార్టీ పెద్దలు తాత్కాలిక రాజీలు కుదుర్చుతున్నారు తప్పిస్తే శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు. గొడవలు జరినప్పుడు పిలిచి మాట్లాడటం సర్ది చెప్పడం పరిపాటిగా మారింది. వివాదం జరిగినప్పుడు గొడవ పెద్దది అయినప్పుడు ఇద్దరూ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇద్దరికి సర్ది చెప్పి మళ్లి గొడవ పడకూడదని చెప్పి పంపిస్తున్నారు. కొన్ని రోజుల తరువాత షరా మామూలే అనే విధంగా పరిస్థితులు మారిపోతున్నాయి. అధికారులు వీరి మధఅయ నలిగిపోతున్నారు.