Mallareddy Land : ఆ భూమి మల్లారెడ్డిది కాదు - తేల్చిన అధికారులు
Telangana news : సుచిత్రలోని భూమి మల్లారెడ్డిది కాదని అధికారులు తేల్చారు. ఈ భూమి తనదేనంటూ ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి చేసిన హడావుడి హైలెట్ అయింది.
Mallareddy Suchitra Land : బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సుచిత్ర పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్ 33 గుంటల స్థలం మల్లారెడ్డి కాదని రెవిన్యూ అధికారులు తేల్చారు. ఈ మేరుకు బుధవారం హైకోర్టుకు రెవెన్యూ అధికారులు నివేదిక అందజేశారు. సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్ట్ ను పంపించారు. సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్ పై 15 బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వే చేపట్టిన రెవిన్యూ అధికారులు.. ఆ భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు తేల్చారు.
సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి అంటున్నారు. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని పదిహేను మంది వ్యక్తులు ఫెన్సింగ్ వేసుకున్నారు. ఈ ఫెన్సింగ్‌ను మల్లారెడ్డి తన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో వచ్చి మే 19వ తేదీన తొలగించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. కానీ మల్లారెడ్డి కేసులు పెట్టుకుంటే పెట్టుకోవాలని తన స్థలాన్ని కాపాుకుంటానని పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ భూ వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూా ఉన్నారు. భూమి తమదే అంటున్న పదిహేను మందిలో ఆయన కూడా ఒకరు. గతంలోనే సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదని.. తనకు సర్వే అవసరంలేదని చెప్పారని ఆయన ఆరోపించారు. 82/e సర్వే నెంబర్‌లో ల్యాండ్‌పై ఇంజెక్షన్ అర్డర్ వేసినా దానికి కౌంటర్ వేయలేదు. అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పినా . కేటీఆర్ మాటలను కూడా మల్లారెడ్డి పెడచెవిన పెట్టారని ఆరోపించారు.
తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని మల్లారెడ్డి అన్నారు . ఈ వివాదం తర్వాత ప్రభుత్వం ఆ స్థలంలో సర్వే చేయించింది. మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిల సమక్షంలోనే సర్వే చేశారు. ఇప్పుడు ఆ సర్వే నివేదిక ను పోలీసులకు పంపారు. భూమి మల్లారెడ్డిది కాదని తేల్చడంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.