Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి సారి రాజకీయ నేతకు నోటీసులు - ఆరోగ్యం బాగోలేదని డుమ్మా కొట్టిన మాజీ ఎమ్మెల్యే
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన ఆరోగ్యం బాగోలేదన్న కారణంగా ఆగిపోయారు.
MLA Chirumurthy Lingaiah: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు మొదటి సారి ఓ రాజకీయ నేతకు నోటీసులు జారీ చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఈ నోటీసులు జారీ చేశారు. నోటీసుల ప్రకారం ఆయన సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు అనారోగ్యంగా ఉందని అందుకే హాజరు కాలేనని చిరుమర్తి లింగయ్య పోలీసులకు సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది. మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి అనుచరునిగా ఉండే లింగయ్య తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయనకు సాక్షిగా నోటీసులు జారీ చేశారా లేకపోతే నిందితుడిగానా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. పోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవస్థీకృతంగా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం మారగానే ట్యాపింగ్ చేసిన పరికరాలన్నీ ధ్వంసం చేశారని గుర్తించి కేసులు పెట్టారు. ఈ క్రమంలో అరెస్టు అయిన పోలీసు అధికారులు ఇంకా జైలులోనే ఉన్నారు. ఏ వన్ గా ఉన్నఇంటలిజెన్స్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా వెళ్లియారు. కేసు నమోదు కాక ముందే వైద్య చికిత్స కోసం వెళ్లిపోయిన ఆయన ఇప్పటి వరకూ తిరిగి రాలేదు. ఆయన కోసం పోలీసులు చాలా ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది.
ప్రభాకర్ రావు వస్తే ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని అనుకున్నారు. అయితే అమెరికాలో ఆయన పెట్టుబడి పెడితే వచ్చే గ్రీన్ కార్డు కోసం ధరఖాస్తు చేసుకున్నారని ఆయన తిరిగి రాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పోలీసులు ఆయన గురించి పక్కన పెట్టేసి కేసులో ఉన్న ఇతర ఆధారాల ప్రకారం.. రాజకీయ నేతల్ని విచారణకు పిలిపిచాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇంత వరకూ ట్యాపింగ్ కేసులో చిరుమర్తి లింగయ్య పేరు ఎప్పుడూ బయటకు రాలేదు. కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ మాజీ ఎమ్మెల్యే లింగయ్య ఈ వ్యవహారంలో ఎలా జోక్యం చేసుకున్నారన్న ది సస్పెన్స్ గా మారింది.
Also Read: Bandi Sanjay: లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్