Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు
తెలంగాణలో ఇప్పటివరకు ఒవిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని.. రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఓ వైపు ఒమిక్రాన్ వ్యాప్తిపై ఆందోళన రేకెత్తుతోంది. ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల నుంచి ప్రయాణికులు.. రావడంతో ఈ ఆందోళన ఎక్కువైంది. తెలంగాణకు వచ్చిన ప్రయాణికుల్లో ఒమిక్రాన్ ఉండే అవకాశలు ఉన్నాయని భావించారు. కానీ ఒమిక్రన్ కు సంబంధించిన కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాక ప్రకటించింది.
ఒమిక్రాన్ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండంటో తెలంగాణలోనూ.. ఈ కేసులు నమోదవుతాయని అధికారులు భావించారు. మరోవైపు ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల నుంచి ఇండియాకు ప్రయాణికులు వచ్చారు. తెలంగాణకు కూడా వచ్చారు. దీంతో.. అధికారులు.. ఇక్కడ కూడా ఒమిక్రాన్ .. కేసులు నమోదవుతాయని అభిప్రాయపడ్డారు. విదేశాల నుంచి వచ్చిన వారికి ఎయిర్ పోర్ట్ లోనే కరోనా పరీక్షలు చేశారు. అలా వచ్చిన వారిలో 13 మందికి పాజిటివ్ తేలింది. పాజిటివ్ వచ్చిన వారిని.. గచ్చిబౌలిలోని టిమ్స్ తరలించారు. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ పరీక్ష కోసం పంపారు.
No case of #Omicron variant of coronavirus has been detected in Telangana so far: State Health Department
— ANI (@ANI) December 6, 2021
కరోనా పాజిటివ్ వచ్చిన 13 మందికి ఒమిక్రాన్ సోకలేదని తాజాగా తేలింది. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు ఊరట లభించింది. తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఒమిక్రాన్ వేరియంట్ మొదటగా నవంబర్ 11న బోట్స్‌వానాలో కనుగొన్నారు. మరో మూడు రోజులకు దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. ఇక అప్పటి నుంచి ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అక్కడి నుంచి ఇండియాకు వచ్చిన వారికి పరీక్షలు చేస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించి.. 20కి పైగా కేసుల వరకు ఉన్నాయి.
Also Read: Omicron Variant: గాలి కారణంగా ఒమిక్రాన్ వ్యాపిస్తుందా? అధ్యయనం ఏం చెబుతోంది?
Also Read: Omicron Threat: ఈ 'చిత్రం' చూశారా? ఇది మార్కెట్టా.. ఎయిర్‌పోర్టా.. లేక వైరస్ హాట్‌స్పాటా?
Also Read: Hyderabad Omicron: హైదరాబాద్ వచ్చిన బ్రిటన్ మహిళకు ఒమిక్రాన్ ఉందా? రిపోర్ట్‌లో ఏం తేలిందంటే..
Also Read: Omicron Symptoms: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట!