Omicron Symptoms: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట!
దేశంలో తేలిన ఐదు ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లోనూ చాలా స్పల్ప లక్షణాలే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
![Omicron Symptoms: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట! Omicron cases India Weakness, body ache Common symptoms of 5 Omicron patients in India Omicron Symptoms: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/21/206f6107acd18330b16825483c695215_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత్‌లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. అయితే ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వచ్చిన వారి లక్షణాలు భిన్నంగా ఉన్నట్లు దక్షిణాఫ్రికా వైద్యులు ఇప్పటికే తెలిపారు. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన ఐదుగురిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తేలింది.
దిల్లీలో తొలి కేసు..
టాంజానియా నుంచి దిల్లీ వచ్చిన వ్యక్తికి నేడు ఒమిక్రాన్ నిర్ధరణైంది. అతనికి గొంతు నొప్పి, నీరసం సహా ఒళ్లునొప్పులు ఉన్నట్లు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి వైద్యులు డా.సురేశ్ కుమార్ తెలిపారు. ఆ ఆసుపత్రిలో కొవిడ్ పాజిటివ్ వచ్చి చేరిన మిగిలి అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఎక్కువ మందికి ఎలాంటి లక్షణాలు లేవన్నారు.
డెల్టా సహా సార్క్ కోవ్-2 ఇతర వేరియంట్లు సోకిన వారిలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు వచ్చాయి. అయితే ఒమిక్రాన్ సోకిన వారిలో మాత్రం ఇతర వేరియంట్లలా కాకుండా సాధారణ లక్షణాలైన జలుబు వంటివే ఉన్నాయి. కానీ ఒమిక్రాన్ వేరియంట్‌పై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
భిన్నమైన లక్షణాలు..
ఒమిక్రాన్ అసాధారణ లక్షణాలను తొలుత సౌతాఫ్రికా వైద్యుడు ఏంజెలిక్ కోజీ గుర్తించారు. సౌతాఫ్రికన్ మెడికల్ అసోసియేషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఏంజెలిక్ యే ఈ వేరియంట్‌ను గుర్తించి తొలుత సౌతాఫ్రికా ప్రభుత్వానికి తెలిపారు. ఎక్కువ మ్యూటేషన్లు ఉండటమే ఈ వైరస్ వ్యాప్తి కూడా కారణమని ఆయన అన్నారు.
కర్ణాటకలో నమోదైన ఒమిక్రాన్ తొలి రెండు కేసులు, మూడో కేసు అయిన ముంబయి మెరైన్ ఇంజనీర్, గుజరాత్ ఎన్‌ఆర్‌ఐ సహా ఇలా వీరందరికీ చాలా స్వల్ప లక్షణాలే ఉన్నాయి. దీంతో ఒమిక్రాన్ సోకిన వారికి తీవ్రమైన లక్షణాలు ఏం లేవని, కేవలం స్వల్పంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కానీ ఈ వేరియంట్‌కు వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. అయితే దీని వల్ల ఎవరికైనా జలుబుగా ఉన్న సాధారణమైనదని అనుకుని లైట్ తీసుకునే ప్రభావం ఉందని పేర్కొన్నారు.
Also Read: Sabarimala Rush: ఒమిక్రాన్ భయాల వేళ పోటెత్తిన శబరిమల.. రికార్డ్ స్థాయిలో 42 వేల మందికి దర్శనం
Also Read: Omicron Cases in India: 'ఒమిక్రాన్‌కు వేగం ఎక్కువ.. కానీ లక్షణాలు స్వల్పమే'
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 2,796 మంది మృతి.. దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు
Also Read: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)