Sabarimala Rush: ఒమిక్రాన్ భయాల వేళ పోటెత్తిన శబరిమల.. రికార్డ్ స్థాయిలో 42 వేల మందికి దర్శనం
శబరిమల ఆలయంలో రికార్డ్ స్థాయిలో శనివారం 42,354 మంది దర్శనం చేసుకున్నారు.
దేశంలో ఒమ్రికాన్ భయాలు నెలకొన్న వేళ కేరళ శబరిమల ఆలయంలో భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం రికార్డ్ స్థాయిలో 42,354 మంది స్వాములు దర్శనం చేసుకున్నారు. శుక్రవారం 27840 మంది అయ్యప్పను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రవేశించే భక్తులకు పోలీసులు.. శానిటైజ్ చేసి లేనివారికి మాస్కులు అందిస్తున్నారు.
Kerala: Heavy rush of pilgrims continues in Sabarimala temple
— ANI (@ANI) December 4, 2021
"27840 pilgrims visited the temple on Friday & 42,354 people had booked to take darshan on Saturday. Police allow pilgrims to enter the shrine after sanitization & give masks to those who require," says State Govt pic.twitter.com/bekqKhpFzD
శబరిమల ఆలయం గత నెలలో తెరుచుకుంది. సీజనల్ యాత్రం సందర్భంగా ఆలయ దర్శనం ప్రారంభమైంది. కరోనా కారణంగా గతంలో అనేకసార్లు దేవాలయం మూతబడినా.. దాదాపు రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో తెరుచుకుంది.
నిబంధనలు ఇవే..
- కొవిడ్ 19 దృష్ట్యా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి, ఆర్‌టీపీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం సమర్పించిన వారికే ఆలయ ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది.
- క్యూలైన్‌లో భౌతికదూరం పాటించడం, మాస్కు ధరించడం విధిగా పాటించాలని ఆదేశించింది.
- భక్తుల రద్దీ దృష్ట్యా కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
- దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి తెలిపారు.
- ప్రసాద కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకూ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
Also Read: Omicron Cases in India: 'ఒమిక్రాన్‌కు వేగం ఎక్కువ.. కానీ లక్షణాలు స్వల్పమే'
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 2,796 మంది మృతి.. దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు
Also Read: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు