Omicron Cases in India: దేశంలో కొత్తగా 2,796 మంది మృతి.. దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు
దేశంలో కొత్తగా 8,895 కేలులు నమోదుకాగా 2,796 మంది మృతి చెందారు. మరో ఒమిక్రాన్ కేసు బయటపడింది.
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 8,895 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మాత్రం దారుణంగా పెరిగింది. గత 24 గంటల్లో 2,796 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 99,155కు చేరింది.
కేరళ, బిహార్‌లో సవరించిన లెక్కలతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో 6918 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) December 5, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/pvG8sm8N6X pic.twitter.com/3hKMHGrWGB
- మొత్తం కేసులు: 3,46,33,255
- మొత్తం మరణాలు: 4,73,326
- యాక్టివ్ కేసులు: 99,155
- మొత్తం కోలుకున్నవారు: 3,40,60,774
పెరిగిన ఒమిక్రాన్ కేసులు..
First Covid Omicron case in Delhi after Tanzania returnee tests positive; 5th in India
— ANI Digital (@ani_digital) December 5, 2021
Read @ANI Story | https://t.co/xrgeZal3K5#COVID19 #OmicronVariant pic.twitter.com/0iTLAvQSXx
దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 5 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. కర్ణాటక, ముంబయి, గుజరాత్, దిల్లీలో ఈ కేసులు వెలుగుచూశాయి. టాంజానియా నుంచి దిల్లీకి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ స్పష్టమైంది.
వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను వెతికే పనిలో ఉన్నారు అధికారులు. అనుమానితుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ ఫలితాలు ఇంకా రాలేదు.
అయితే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంటుందని కానీ దాని వల్ల ఇప్పటివరకు ఎక్కడా మరణాలు సంభవించలేదని నిపుణులు అంటున్నారు.
Also Read: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు