Omicron Variant: గాలి కారణంగా ఒమిక్రాన్ వ్యాపిస్తుందా? అధ్యయనం ఏం చెబుతోంది?

గాలి ద్వారా ఒమిక్రాన్ వ్యాపిస్తుందా? అవునన్నట్టుగానే అనిపిస్తందంటున్నారు కొంతమంది నిపుణులు. హాంకాంగ్ హోటల్ లోని ఘటనను ఉదాహరణగా చెబుతున్నారు.

FOLLOW US: 

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై కొంతకాలంగా చర్చ జరుగుతుంది. ఎలా వస్తుందనేదానిపై స్పష్టత లేదు. వచ్చిన వారిలో లక్షణాలు కూడా తెలియట్లేదు. అయితే ఒమిక్రాన్ గాలిలో వ్యాపిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానంపై మరో చర్చ జరుగుతుంది. హాంకాంగ్ లోని ఓ హోటల్ లో ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ కావడంతో దీనిపై మరిన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనే జర్నల్‌లో ఓ అధ్యయన ప్రచురించారు. దాని ప్రకారం.. 

హాంకాంగ్ లో ఓ క్వారంటైన్  హోటల్ లో ఇద్దరు వ్యక్తులు జాయిన్ అయ్యారు. అందులో మెుదటి వ్యక్తికి నవంబర్ 13, 2021న ఎలాంటి లక్షణాలు లేకుండా కొవిడ్ పాజిటివ్ వచ్చింది. మరో వ్యక్తి నవంబర్ 17, 2021న కొన్ని లక్షణాలతో పరీక్ష చేయించుకోగా అతడికి పాజిటివ్ వచ్చింది.  ఓ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్నారు. అయితే వీరిద్దరూ.. తమ గదులను అస్సలు విడిచి పెట్టి బయటకు రాలేదు. కనీసం ఎవరినీ కలవలేదు. అయినా వీరిద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. భోజనం తీసుకునేందుకు, కొవిడ్ పరీక్ష కోసం మాత్రమే తలుపులు తెరిచారు. దీంతో గాలి ద్వారా ఒక రూమ్ నుంచి మరో రూమ్ కి వైరస్ సోకి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇద్దరు వ్యక్తులు అంతకుముందే రెండు డోసుల టీకాలు వేయించుకున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ మొదటగా నవంబర్ 11న బోట్స్‌వానాలో కనుగొన్నారు. మరో మూడు రోజులకు దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. ఇక అప్పటి నుంచి ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అక్కడి నుంచి ఇండియాకు వచ్చిన వారికి పరీక్షలు చేస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించి.. 20కి పైగా కేసుల వరకు ఉన్నాయి.

కొవిడ్-19తో పోరాడిన వ్యక్తులలో మళ్లీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త వేరియంట్ గురించి సరిగా తెలియదు కాబట్టి.. ఇది అంటువ్యాధిగా ఉందా?(కొంతమంది ఆరోగ్య అధికారులు అనుమానిస్తున్నట్లుగా), ఇది ప్రజలను మరింత తీవ్రమైన అనారోగ్యానికి గురి చేస్తుందా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, డెల్టా వేరియంట్ కంటే ఇది తక్కువ ప్రమాదకరమైనదని మరోవైపు యూఎస్ ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

Also Read: Omicron Threat: ఈ 'చిత్రం' చూశారా? ఇది మార్కెట్టా.. ఎయిర్‌పోర్టా.. లేక వైరస్ హాట్‌స్పాటా?

Also Read: Omicron Cases: ఇండియాలో 21కి చేరుకున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు

Also Read: Omicron Symptoms: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట!

Published at : 06 Dec 2021 06:22 PM (IST) Tags: covid 19 Omicron Hong Kong quarantine hotel Omicron spread in air Hong Kong study on omicron omicron latest updates

సంబంధిత కథనాలు

US Formula Milk Shortage :  అమెరికాలో ఫార్ములా మిల్క్ కొరత - ఎక్కడ చూసినా నో స్టాక్ !

US Formula Milk Shortage : అమెరికాలో ఫార్ములా మిల్క్ కొరత - ఎక్కడ చూసినా నో స్టాక్ !

Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Russia Ukraine War :  ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!

Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!

Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !

Afghan Taliban Rules :  టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !

Umbrella Costs 1 Lakh : ఆ గొడుగు ధర అక్షరాలా లక్ష - వర్షంలో బయటకు తీసుకెళ్లారో తడిచిపోతారంతే !

Umbrella Costs 1 Lakh :  ఆ గొడుగు ధర అక్షరాలా లక్ష - వర్షంలో బయటకు తీసుకెళ్లారో తడిచిపోతారంతే !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌	గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

IPL 2022 TV Ratings: ఐపీఎల్‌ టీవీ రేటింగ్స్‌ ఢమాల్‌! పరిహారం డిమాండ్‌ చేస్తున్న అడ్వర్టైజర్లు

IPL 2022 TV Ratings: ఐపీఎల్‌ టీవీ రేటింగ్స్‌ ఢమాల్‌! పరిహారం డిమాండ్‌ చేస్తున్న అడ్వర్టైజర్లు

Buggana On Jagan London Tour : జగన్ లండన్ వెళ్లింది నిజమే కానీ అసలు కారణం వేరే - బుగ్గన వివరణ !

Buggana On Jagan London Tour :  జగన్ లండన్ వెళ్లింది నిజమే కానీ అసలు కారణం వేరే - బుగ్గన వివరణ !

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు