Miss Universe 2025: ఆరేళ్ల వయసులోనే తీవ్ర సమస్యలు - అయినా ఇప్పుడు మిస్ యూనివర్శ్ - స్ఫూర్తినిచ్చే ఫాతిమా బోష్ జీవితం
Fatima Bosch: మిస్ యూనివర్శ్ గా అర్జెంటీనా భామ ఫాతిమా బోష్ ఎన్నికయ్యారు. ఆమె ఈ స్థాయికి వచ్చిన వైనం అందరికీ స్ఫూర్తినిస్తుంది.

Fatima Bosch Miss Universe 2025 was diagnosed with dyslexia: మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుపొందిన మెక్సికో అందగత్తె ఫాతిమా బోష్, తన బాల్యంలో ఎదుర్కొన్న డిస్‌లెక్సియా , యాటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిసార్డర్ (ADHD) వంటి లెర్నింగ్ రుగ్మతల గురించి బహిరంగంగా చెప్పుకున్నారు. 6 సంవత్సరాల వయస్సులో బయటపడిన ఈ సమస్యలు ఆమె జీవితంలో తీవ్రమైన సవాళ్లుగా మారాయి, కానీ ఆమె వాటిని బలాలుగా మలిచుకుని ప్రపంచ ఆందాల పోటీల్లో పోటీలో విజేతగా నిలిచారు.
ఫాతిమా బోష్ 6 సంవత్సరాల వయస్సులో డిస్‌లెక్సియా , ADHDతో బాధపడ్డారు. డిస్‌లెక్సియా అంటే చదవడం రాకపోవడం, అక్షరాలు గుర్తించలేకపోవడం, వరుస క్రమం గుర్తుంచుకోవడం వంటివి. ADHD అయితే ఫోకస్, ఇంపల్స్ కంట్రోల్, రోజువారీ జీవితంలో ఆకస్మిక శ్రద్ధ లోపాలు వంటి సమస్యలకు కారణం అవుతుంది. ఈ రెండూ మెదడు పనితీరులో తేడాలు రావడానికి కారమం అవుతాయి. కానీ తక్కువ సామర్థ్యం కాదు. నిపుణుల ప్రకారం, ఈ సమస్యలు బాల్యంలో గుర్తించకపోతే పెద్ద వయస్సు వరకూ కొనసాగుతాయి. పిల్లల్లో గుర్తించిన వెంటనే థెరపీ, సపోర్ట్) అవసరం.
ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇది మన మెయిన్ పర్పస్‌ను డెవలప్ చేయడానికి సహాయపడుతుంది అని పాజిటివ్ గా చెబుతున్నారు ఫాతిమా. ఆమె పాఠశాల రోజుల్లో ఈ సమస్యల కారణంగా ఎగతాళిని ఎదుర్కొన్నారు. చదవడంలో ఆలస్యం, సరిగ్గా శ్రద్ధ చూపలేకపోవడం వల్ల సహ విద్యార్థులు, టీచర్ల నుంచి ఎదుర్కొన్న హేళనలు ఆమె మానసిక బలంపై ప్రభావం చూపాయి. తాను డీలాపడలేదని మరింత ధృడంగా తయారయ్యానని ఆమె చెబుతున్నారు. ఎగతాళి చేయబట్టే.. తాను పట్టుదలతో ఎదిగానని చెబుతున్నారు.
Me siento súper emocionada, llena de sentimientos, de nostalgia, de todo el trabajo y de todo lo que se vivió en estas semanas de concentración. Yo sabía que en esa banda, en México, salía yo; tenia que salir con fuerza a representar a todas las mujeres que creyeron en mí y a… pic.twitter.com/SgDYZCFSj1
— Fatima Bosch (@fatimaboschfdz) November 21, 2025
ఫాతిమా ఈ కష్టాలను అధిగమించడానికి సానుకూల దృక్పథాన్ని ఎంచుకున్నారు. తన సమస్యలను గుర్తించి, అవి తన లక్ష్యానికి సహాయకరమని భావించారు. మిస్ యూనివర్స్ పోటీలో "బీ రియల్ – మనసులో ఉన్నదాన్ని డేర్ చేయడమే అతి డీప్‌గా ఉండడం" అని చెప్పి అందర్నీ ఆకట్టుకున్నారు. డిస్‌లెక్సియా, ADHD వంటివి కష్టమే, కానీ అవి మనల్ని నిర్దేశించలేవు అని ఆమె స్పష్టం చేశారు. ఈ సమాధానమే ఆమె మిస్ యూనివర్స్ విజయానికి కీలకం అయింది. ప్రపంచవ్యాప్తంగా లెర్నింగ్ డిసెబిలిటీలతో బాధపడుతున్నవారికి మంచి మెసేజ్ ఇచ్చారు. ఫాతిమా బోష్ కథ లెర్నింగ్ డిసబిలిటీలపై అవేర్‌నెస్‌ను పెంచుతోంది. లక్షల మంది పిల్లలు, పెద్దలు ఈ సమస్యలతో పోరాడుతున్నారు,





















