News
News
వీడియోలు ఆటలు
X

CM KCR తరహాలో రైతులకు కేంద్రం కూడా రూ.10 వేలు ప్రకటించాలి: మంత్రి ప్రశాంత్ రెడ్డి

రైతులకు ఎకరానికి 10వేల పంట నష్ట సహాయం ప్రధాని మోడీ చేత ప్రకటించిన తర్వాతే బీజేపీ నాయకులు రైతుల పొలాల్లో అడుగు పెట్టాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

FOLLOW US: 
Share:

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలో దెబ్బతిన్న నువ్వుల పంట, టమాటా, వరి పంటలను పరిశీలించి బాధిత రైతు సంతోష్ కు మనో ధైర్యం చెప్పారు. నష్టపోయిన పంటలకు కేసీఆర్ ఎకరానికి 10వేల ఇచ్చినట్లు కేంద్రం కూడా 10వేలు ప్రకటించాలని మంత్రి వేముల సవాల్ చేశారు. రైతులకు ఎకరానికి 10వేల పంట నష్ట సహాయం ప్రధాని మోడీ చేత ప్రకటించిన తర్వాతే బీజేపీ నాయకులు రైతుల పొలాల్లో అడుగు పెట్టాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరాకు 10వేల సహాయంతో రైతులకు అండగా నిలుస్తున్నరని గుర్తు చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే కేంద్రం కొర్రీలు పెడుతుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రైతుల ధాన్యాన్ని తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఎఫ్సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి వెకిలి చేష్టలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగుమారిన ధాన్యం కొనమని చెప్తూ.. రైతుల వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొనకుండా అడ్డుకునేది వారే.. రైతులను రెచ్చ గొట్టేది వారేనని బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవని అన్నారు. 

రైతులతో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా రాజకీయాలు 
రైతు పక్షపాతి అయిన కేసీఆర్.. పండిన పంటను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడకూడదని ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్,మధ్య ప్రదేశ్,మొన్నటి వరకు ఉన్న కర్ణాటకలో గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, పంట పెట్టుబడి సాయం, రైతు భీమా లతో కేసీఆర్ ప్రభుత్వం భరోసాగా నిలిస్తే.. బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతులతో దుర్మార్గంగా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మోర్తాడ్ మండలంలో పలు అభివృద్ది పనుల శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దోన్కల్ గ్రామంలో NH 16 నుండి NH 7 (వయా దోన్కల్,రేంజర్ల) వరకు 4.47 కోట్లతో బిటి రోడ్డు పునరుద్ధరణ శంకుస్థాపన, దోన్కల్ నుంచి పోచంపల్లి వరకు వయా వడ్డెర కాలనీ 90 లక్షలతో రోడ్ మరమ్మతులు పనుల శంకుస్థాపన చేశారు. ధర్మోరా గ్రామంలో NH 16 నుండి NH 7 (వయా దోన్కల్,రేంజర్ల) వరకు 4.47 కోట్లతో బిటి రోడ్డు పునరుద్ధరణ శంకుస్థాపన చేశారు. షేట్ పల్లి నుండి వన్నెల్ బి క్రాస్ రోడ్ వరకు 3.95 కోట్లతో నూతన బిటి రోడ్ పనుల శంకుస్థాపన, ముప్కాల్  మండలం రేంజర్ల గ్రామంలో NH 16 నుండి NH 7 (వయా దోన్కల్, రేంజర్ల) వరకు 4.47 కోట్లతో బీటీ రోడ్డు పునరుద్ధరణ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో వందల కోట్లతో రోడ్లు నిర్మించుకున్నమని, మౌళిక సదుపాయాల ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. పసుపు బోర్డు పేరుతో మోసం చేసిన బీజేపీ పార్టీ వారు మాటలు చెప్పుడు తప్పా అభివృద్ది చేసింది ఏమి లేదని ఎద్దేవా చేసారు. గ్రామాల్లో తిరుగుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మంచి చేస్తున్నది ఎవరు.. మాటలు చెప్పి ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఎవరో ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.

Published at : 07 May 2023 07:31 PM (IST) Tags: Farmers Telangana Rains KCR NIZAMABAD Vemula Prashanrh Reddy

సంబంధిత కథనాలు

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

KCR Nirmal Tour: నేడు నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్, బహిరంగ సభ కూడా

KCR Nirmal Tour: నేడు నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్, బహిరంగ సభ కూడా

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు