అన్వేషించండి
Advertisement
Morning Top news: రేవంత్ వ్యూహాత్మక అడుగులు, పవన్ ఆసక్తికర ట్వీట్ వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
రేవంత్ వ్యూహాత్మక అడుగులు
తెలంగాణ ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డి చిట్‌చాట్‌లలో చేస్తున్న వ్యాఖ్యలు.. వ్యూహాత్మకంగా చేస్తున్నవే అన్న వాదన వినిపిస్తోంది. మరో ఏడాదిలో కేసీఆర్ పేరు ఎక్కడా వినపడకుండా చేస్తానని.. కేటీఆర్‌తోనే కేసీఆర్‌ను బయటకు రాకుండా చేస్తానని ఇటీవల రేవంత్ ఆన్నారు. కేటీఆర్, హరీష్ పోటీలో కేటీఆర్ కనిపించకుండా పోతాడన్నారు. ఈ మాటలు విన్న బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ పేరును లేకుండా ఎవరూ చేయలేరని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఇలాంటి పొలిటికల్ చిట్ చాట్‌లను తన రాజకీయ వ్యూహాల కోసం వినియోగించుకుంటారన్న వాదన వినిపిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి ఏర్పాటైంది. టీటీడీ నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలకమండలిని నియమించారు. బోర్డులో ఎమ్మెల్యేలు, కేంద్ర మాజీ మంత్రి, వ్యాపారవేత్తలు సహా పలు రంగాల వారు చోటు దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి టీటీడీ కొత్త పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. మాజీ సీజేఐ జస్టిస్ హెచ్ ఎల్ దత్తు టీటీడీ బోర్డు మెంబర్ గా ఎంపికయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మయోనైజ్‌పై నిషేధం
ప్రాణాలు హరించివేస్తున్న మయోనైజ్‌పై నిషేధం విధిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. హోటళ్లలో తనిఖీలు, కల్తీ ఆహార పుడ్ వినియోగాన్ని అరికట్టడానికి నియమించిన కమిటీల పనితీరుపై ఆరా తీశారు. వివిధ రకాల ఫుడ్ తో మయోనైజ్‌ను తయారు చేస్తున్నారని అధికారులు మంత్రికి చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బాణసంచా తయారీ కేంద్రంపై పిడుగు
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగు పడటంతో ఇద్దరు మృతిచెందారు. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పవన్ ఆసక్తికర ట్వీట్
దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్‌లో ఉన్న హిందువుల భద్రత కోసం ప్రార్థించండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఓ చిన్న పిల్లాడు పాడుతున్న పాటను షేర్ చేసి కీలక కామెంట్స్ పోస్టు చేశారు. సింధి భాషలో ఓ బాలుడు పాడుతున్న పాట వైరల్‌గా మారుతోంది. భారత్ నుంచి విడిపోయామన్న బాధను చెబుతూ ఆ బాలుడు పాడిన పాటను పవన్ కల్యాణ్ రీషేర్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
దిక్కుతోచని స్థితిలో జగన్
నిన్నటి వరకూ షర్మిల వర్సెస్ జగన్ అన్నట్టుగా సాగిన వైఎస్ కుటుంబ ఆస్తులు గొడవ విజయమ్మ బహిరంగ లేఖతో ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకుంది. జగన్ అనుమతితోనో లేక జగన్ పార్టీ మీద ఉన్న అభిమానంతోనో ఇప్పటివరకూ షర్మిలపై ఏదో ఒక స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇది ఒక అన్న చెల్లెళ్ల మధ్య గొడవగానే ఉండిపోతుందనుకున్నవారికి తల్లి విజయమ్మ అనూహ్యంగా బహిరంగ లేఖ రాయడం జగన్‌కు, వైసీపీ నేతలకు మింగుడు పడట్లేదు. ఈ అంశంపై తమకు తాముగా నోరెత్తలేని పరిస్థితి ఎదురైంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల
TGPSC గ్రూప్-3 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. నవంబర్ 17, 18వ తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్-1 ఎగ్జామ్, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని పేర్కొంది. 18న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-3 ఉంటుందని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ ఖరారు
APPSC గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 5న రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు APPSC ప్రకటించింది. ఉమ్మడి 13 జిల్లాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది హాజరుకానున్నారని APPSC అంచనా వేస్తోంది. డీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు APPSC తెలిపింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కుల గణన సర్వే చేసేది వీళ్లే
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కుల గణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. నవంబర్ 6 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కుల గణన ప్రక్రియ మొదలుకానుంది. అయితే ఈ సమగ్ర కుటుంబ సర్వే ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. స్కూలు టైమింగ్స్ పూర్తయ్యాక ఉపాధ్యాయులు రోజుకు 5 నుంచి 7 ఇళ్లల్లో సమగ్ర సర్వే చేయనున్నారు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సీక్రెట్‌గా ఇండియా వచ్చి ట్రీట్‌మెంట్ చేయించుకున్న బ్రిటన్ రాజ
బ్రిటన్ రాజ దంపతులు చార్లెస్, కెమిల్లాలు ఇటీవల బెంగళూరు వచ్చారు. ఓ ప్రముఖ ప్రకృతి వైద్య కేంద్రంలో చికిత్స పొందారు. ఇటీవల బ్రిటన్ కింగ్ చార్లెస్ కు క్యాన్సర్ ఉన్నట్లుగా బయటపడింది. దీంతో ఆయన ప్రకృతి వైద్యాన్ని కూడా నమ్ముకున్నారు. బెంగళూరులోని శౌక్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్ లో కొన్నాళ్లు ట్రీట్ మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం కాబట్టి ఎంత సీక్రెట్ గా వచ్చారో అంతే సైలెంట్ గా వెళ్లిపోయారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఇండియా
అమరావతి
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion