(Source: ECI/ABP News/ABP Majha)
YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
YSRCP : వైఎస్ కుటుంబంలో ఏర్పడిన ఆస్తుల వివాదం రాజకీయంగా ప్రకంపనలకు కారణం అవుతోంది. ఇప్పుడు ఈ వివాదానికి ముగింపు ఎమిటన్నది సస్పెన్స్‌గా మారింది.
What is the end of the Jagan family property disputes: ఘర్ ఘర్ కి కహానీ అని తన ఇంట్లో జరుగుతున్న ఆస్తుల వివాదంపై జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కానీ అందరి ఇళ్లల్లో ఉండే కహానీలపై ఎవరికీ ఆసక్తి ఉండదు. కానీ వైఎస్ కుటుంబంలో కహానీలు అంటే ప్రజలు అందరూ ఆసక్తి చూపిస్తారు. పొలిటికల్ గా పవర్ ఫుల్ల ఫ్యామీల్లో ఒకటి.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన జగన్ వ్యవహారశైలి ఇందులో చర్చనీయాంశమవుతాయి కాబట్టి రాజకీయంగా కూడా కీలకమే. ఇప్పుడీ వివాదాన్ని వీలైనంత త్వరగా ముగించుకోకపోతే జగన్మోహన్ రెడ్డినే ఎక్కువగా రాజకీయంగా నష్టపోతారు. అందుకే ఇప్పుడు ఓ పరిష్కారం వెదుక్కోవవాల్సిన అవసరం ఏర్పడింది.
లీగల్‌గా తన స్వార్జితం కాబట్టి బంధాలు తెంపేసుకోవడం మొదటి చాయిస్ !
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులు స్వార్జితం అంటున్నారు. తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తుల్ని లీగల్‌గా పంచేసుకున్నామని మిగిలిన ఆస్తులన్నీ తన స్వార్జితమేనని అందుకే అందులో ఎవరికీ హక్కు లేదని చెబుతున్నారు. తన సోదరిపై ప్రేమాభిమానాలతో కొంత వాటా ఇవ్వడానికి ఎంవోయూ చేశానని .. కానీ ఇప్పుడు అలాంటివేమీ లేవు కాబట్టి అది చెల్లదని కోర్టుకు వెళ్లారు. అంటే జగన్ మోహన్ రెడ్డి తన సోదరితో ఇక ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లే అవుతుంది. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించేసి ఇక వివాదాన్ని ముగించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలోచనతోనే ప్రెస్ మీట్ పెట్టాలని ఇడుపుల పాయ వచ్చినా విజయమ్మ లేఖ కారణంగా జగన్ మనస్థాపానికి గురయ్యారని అందుకే వెల్లడించలేదని అంటున్నారు.
ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
వివాదం లేకుండా ఆస్తలు పంచి ఇచ్చేయడం రెండో చాయిస్
ఆస్తుల వివాదంతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ను తూకం వేసే అవకాశం ఉంది. సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయని వారు ప్రజలకు ఏం చేస్తారని అనుకుంటారు. అందుకే ఇలాంటివి బహిరంగంగా రాకూడదని అనుకుంటారు.కానీ వచ్చాయి. ఇప్పుడు జగన్ రాజకీయ భవిష్యత్ కోసం ముందు ముందు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తన తల్లి చెప్పినట్లుగా ఆస్తుల్ని పంచేసి ఇచ్చేస్తే వివాదం పరిష్కారం అవుతుంది. అప్పుడు కుటుంబం కూడా మళ్లీ కలిసిపోతుంది. ఆస్తులు ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు కానీ రాజకీయంగా ఎంతో బలమైన బేస్ ఇచ్చిన వైఎస్ ఫ్యామిలీ అనే బ్రాండ్ చీలిపోతే జగన్‌కే తీవ్ర నష్టం జరుగుతుంది. ఆ దిశగా ఆలోచిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.
విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
వివాదం కొనసాగితే వైసీపీకి రాజకీయంగా ఇబ్బందే !
ఆస్తుల వివాదాలు పరిష్కరించుకోవడం అంత తేలిక కాదు. ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఎవరో ఒకర అసంతృప్తికి గురి కావాలి . కానీ పరిష్కారం జరిగినప్పుడు రెండు పార్టీలు ఎంతో కొంత తమకు అన్యాయం జరిగిందని అనుకుంటాయి. అయితే పరిష్కారం కావడం అనేదే అసలు పెద్ద విజయం. ఒక వేళ అదే లేకపోతే ఆస్తలు కొన్ని సందర్బాల్లో ఎవరికీ కాకుండా పోతాయి. ఎవరూ ఉపయోగించుకోలేక నిరుపయోగంగా ఉంటాయి. కానీ వైఎస్ ఫ్యామిలీలో పొలిటికల్ ఇమేజ్ కూడా ఓ ఆస్తి లాంటిదే. అది కూడా ఇప్పుడు ఈ వివాదంలో కీలకంగా మారింది. ఎంత త్వరగా పరిష్కారమైతే ఆ ఆస్తి అంతగా ఉంటుంది. లేకపోతే అది కూడా కరిగిపోతుంది.