News
News
వీడియోలు ఆటలు
X

Top 10 Headlines Today: లేటెస్ట్ అప్‌డేట్స్‌తో మే 19 నాటి మార్నింగ్ టాప్‌ టెన్‌ న్యూస్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..

FOLLOW US: 
Share:

Top 10 Headlines Today:

కర్ణాటక ఫజిల్‌ను 72 గంటల్లో కాంగ్రెస్ ఎలా ఛేదించింది

కర్ణాటకలో అద్భుత విజయం తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. సీఎంగా సిద్ధరామయ్య పేరును అధిష్ఠానంతోపాటు సీఎల్పీ కూడా ఓకే చెప్పేసింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది. అయితే కర్ణాటకలో విజయానికి కాంగ్రెస్‌ ఎంత కష్టపడిందో... ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి అంతకంటే ఎక్కువే కష్టపడిందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత‌న జ‌రిగిన రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభ‌మైన స‌మావేశం మూడు గంటల పాటు సాయంత్రం 6:15 గంట‌ల వ‌ర‌కు సాగింది. దాదాపు మూడు గంట‌ల‌కు పైగా మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర ఆవిర్భావ ద‌శాబ్ది వేడుక‌ల‌తో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఈ స‌మావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారితో పాటు ప‌లు శాఖ‌ల ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించి వివరించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో బజరంగ్‌దళ్‌ వివాదం 

తెలంగాణలో భజరంగ్‌దళ్‌ను నిషేధించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భజరంగ్‌ దళ్‌ను నిషేధించడంలో కాంగ్రెస్‌తో కేసీఆర్ పోటీ పడుతున్నారని మాట్లాడారు. కేసీఆర్ కుట్రను తిప్పికొట్టటానికి హిందువులంతా ఒక్కటి కావాలని పిలుపు ఇచ్చారు. గురువారం బీజేపీ ఓబీసీ సమ్మేళనం జరిగింది. ఈ సభలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రూ.1600 కోట్లతో కొత్త సచివాలయం కట్టిన సీఎం కేసీఆర్, బీసీల ఆత్మగౌరవ భవనం ఎందుకు నిర్మించటడం లేదని ప్రశ్నించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎటు చూసినా టీడీపీనే కనిపిస్తోందా? 

రాజకీయ పార్టీలు ప్రజల్లో ఎంత కలసిిపోతే ఓట్ల పరంగా అంత అడ్వాంటేజ్ వస్తుంది. ఆ విషయం రాజకీయ పార్టీలకు తెలియనిదేం కాదు. అయితే ఇలాంటి అడ్వాంటేజ్ ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువగా ఉంటుంది. ఎంత మేర ఉపయోగించుకుంటారన్నది కీలకం. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉంది .  కొంత కాలంగా ఏపీలో ఎటు  వైపు చూసినా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలే కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలు సైలెంట్ గా ఉన్నాయి.  జనసేనాని ఇంకా రంగంలోకి దిగలేదు. సీఎం జగన్ కూడా .. పల్లెబాట అంటున్నారు కానీ ఎప్పటికో తెలియదు. ఇప్పటికైతే  ఓ వైపు లోకేష్.. మరో చంద్రబాబు పర్యటనలతో ఎటు చూసినా టీడీపీనే కనిపిస్తోంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పలు చోట్ల తేలికపాటి వర్షాలు

ద్రోణి ఒకటి తూర్పు మధ్య ప్రదేశ్ నుండి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో గురువారం (మే 18) తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు  వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణమే కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ఎల్లుండి తేలికపాటి  నుండి మోస్తారు వర్షాలు  దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ  కురిసే  అవకాశం ఉంది. హైదరాబాద్  మరియు చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు  39 నుండి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్లకు షాక్‌

భారతీయులు, తమ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా విదేశాల్లో ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం ఇక కుదర్దు. క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్లకు షాక్‌ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణ సమయాల్లో క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చేసే వ్యయాలకు సంబంధించి రూల్స్‌ మార్చింది. ఇంటర్నేషనల్‌ క్రెడిట్‌ కార్డుల (ICC) వినియోగాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ (LRS) పరిధిలోకి తీసుకువచ్చింది. దీనివల్ల, ప్రస్తుతం 5%గా ఉన్న 'మూలం వద్ద పన్ను' (Tax collection at source లేదా TCS) రేటు కాస్తా ఇకపై 20%కు చేర్చింది. అంతేకాదు, LRS పరిధిలోకి రావడం వల్ల, ఒక సంవత్సరంలో, విదేశాల్లో 2.5 లక్షల డాలర్లను దాటి క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా ఖర్చు చేయాలన్నా, మరేదైనా విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించాలన్నా ఇకపై రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి తీసుకోవాలి. గతంలో ఈ పరిమితి లేదు. కొత్త రూల్స్‌ ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడు ప్రయాణం చేయండి తర్వాత చెల్లించండి

మన దేశ ప్రజల జీవితాల్లో రైలు ప్రయాణం ఒక భాగం. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 13,169 ప్యాసింజర్ రైళ్లు ‍‌(లాంగ్‌ డిస్టాన్స్‌, సబర్బన్ మార్గాల్లో) నడుస్తున్నాయి. ఇవి, దేశవ్యాప్తంగా 7,325 స్టేషన్లను కలుపుతూ 1,15,000 కి.మీ. కవర్ చేస్తుంటాయి. ప్రతిరోజూ 2.30 కోట్లకు పైగా ప్రజలు భారతీయ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైల్వేలో సగటున రోజుకు 5 లక్షల టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. వీటిలో 55% టిక్కెట్లను రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో ప్రజలు కొంటుండగా, 37% టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. 8% టికెటింగ్ ఏజెంట్ల ద్వారా జరుగుతోంది.మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 రన్ మిషీన్ మళ్లీ పరుగులు పెట్టింది. ఛేదనలో మొనగాడు.. భారీ టార్గెట్ ను అవలీలగా దంచేశాడు.   ఎంత ఒత్తిడి ఉంటే అంత  మెరుగ్గా ఆడే కింగ్ కోహ్లీ.. ఐపీఎల్-16 లో ఆర్సీబీ ఆశలు సజీవంగా ఉండాలంలే సన్ రైజర్స్ హైదరాబాద్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌‌లో శతకంతో చెలరేగాడు.  ఉప్పల్‌ స్టేడియంలో  ఉప్పెన  సృష్టించి  రికార్డుల  దుమ్ము దులిపాడు. నాలుగేండ్ల తర్వాత ఐపీఎల్ లో శతకం బాదిన  కోహ్లీ ఈ క్రమంలో నెలకొల్పిన రికార్డులు ఇక్కడ చూద్దాం.

అతిథి పాత్రలో కపిల్

ఇండియాలో క్రికెట్, సినిమాలకు ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవి మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రెండు వేర్వేరు ఎంటర్టైన్మెంట్ సాధనాలు అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ రెండు రంగాలలో నిష్టాతులైన ఇద్దరు లెజెండ్స్ చేతులు కలుపుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ లు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కార్యదక్షత, నైపుణ్యం

పవన పుత్ర హనుమాన్ అత్యధిక భక్తులు కలిగిన దేవతల్లో ఒకరు. అంజనీ పుత్రుడు ఆంజనేయుడు వయో, లింగ బేధాలు లేకుండా అందరికీ ఆరాధనీయుడు. హనుమంతుడు ధైర్యానికి, భక్తికి, సుగుణానికి, ధర్మానికి ప్రతీక. ఆయన తన జీవితం ద్వారా, అతడి పాత్రల ద్వారా మనకు ఆదర్శాలకు మార్గదర్శనం చేస్తాడు. మహా భారతంలో శ్రీ కృష్ణుడి పాత్ర ఎంత ప్రధానమైందో రామాయణంలో హనుమ కూడా అలాంటి గొప్ప పాత్ర. శివుడి తేజస్సుతో, వాయువు అనుగ్రహంతో అంజనా, కేసరి దంపతులకు జన్మించిన మహావీరుడు. కేవలం దేహబల సంపన్నుడు మాత్రమే కాదు బుద్ధి బలం కలిగిన వాడు  కనుకనే సుగ్రీవుడి మంత్రిగా రాజ్యపాలన సుభిక్షంగా సాగించాడు. మహా శక్తి సంపన్నుడైన ఆంజనేయుడికి ఎక్కడ పెరగాలి, ఎక్కడ తరగాలి, ఎక్కడ మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఎక్కడ మౌనం వహించాలి వంటివన్నీ ఎరిగిన వివేకవంతుడు హనుమంతుడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published at : 19 May 2023 08:01 AM (IST) Tags: AP news today Telangana LAtest News Todays latest news Top 10 headlines today Telugu Top News Website Top Telugu News Website Top 10 Telugu News

సంబంధిత కథనాలు

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

MP Arvnid: కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నరు: ఎంపీ అర్వింద్

MP Arvnid: కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నరు: ఎంపీ అర్వింద్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్