By: ABP Desam | Updated at : 19 May 2023 06:00 AM (IST)
Representational image/pixabay
పవన పుత్ర హనుమాన్ అత్యధిక భక్తులు కలిగిన దేవతల్లో ఒకరు. అంజనీ పుత్రుడు ఆంజనేయుడు వయో, లింగ బేధాలు లేకుండా అందరికీ ఆరాధనీయుడు. హనుమంతుడు ధైర్యానికి, భక్తికి, సుగుణానికి, ధర్మానికి ప్రతీక. ఆయన తన జీవితం ద్వారా, అతడి పాత్రల ద్వారా మనకు ఆదర్శాలకు మార్గదర్శనం చేస్తాడు. మహా భారతంలో శ్రీ కృష్ణుడి పాత్ర ఎంత ప్రధానమైందో రామాయణంలో హనుమ కూడా అలాంటి గొప్ప పాత్ర. శివుడి తేజస్సుతో, వాయువు అనుగ్రహంతో అంజనా, కేసరి దంపతులకు జన్మించిన మహావీరుడు. కేవలం దేహబల సంపన్నుడు మాత్రమే కాదు బుద్ధి బలం కలిగిన వాడు కనుకనే సుగ్రీవుడి మంత్రిగా రాజ్యపాలన సుభిక్షంగా సాగించాడు. మహా శక్తి సంపన్నుడైన ఆంజనేయుడికి ఎక్కడ పెరగాలి, ఎక్కడ తరగాలి, ఎక్కడ మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఎక్కడ మౌనం వహించాలి వంటివన్నీ ఎరిగిన వివేకవంతుడు హనుమంతుడు.
హనుమంతుడిలోని సుగుణాలు అలవరచుకున్న ఎవరైనా విజయం సాధించాల్సిందే. సర్వసంపదలు చేరువవుతాయి. వ్యక్తిత్వ వికాసానికి చక్కని పాఠం హనుమంతుడి చరిత్ర. హనుమంతుడు ఒక నైపుణ్యం కలిగిన మేనేజర్. మనస్సు, మాట, పనిలో ఉండాల్సిన సమతుల్యతను హనుమంతుని నుంచి నేర్చుకోవచ్చు. సరైన పని, సరైన పని చేయడం అతడి గొప్ప లక్షణం. హనుమత్ చరిత్ర ద్వారా ఎలాంటి జీవన నైపుణ్యాలు నేర్చుకోవచ్చో తెలుసుకుందాం.
హనుమంతుడు పూర్తి స్థాయిలో నిస్వార్థ పూరిత రామభక్తుడని లోక విధితమైన విషయం. అచంచల రామ భక్తి, ఎలాంటి లాభాపేక్ష లేని రాముడి మీద ఉన్న ప్రేమ అతడికి ఇతర దేవతల నుంచి కూడా గౌరవాన్ని అందించింది. హనుమంతుడి జీవిత లక్ష్యం రామభక్తి. అలాగే ప్రతి వారు వారి జీవితంలో తమ లక్ష్యం కోసం అంకిత భావంతో కృషి చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. నిస్వార్థం, నిబద్ధత దీర్ఘకాలంలో గొప్ప విజయాలను అందిస్తుంది.
హనుమంతుడు ఏ పనిలోనైనా నైపుణ్యం కలిగిన వాడు, కార్యదక్షత కలిగిన వాడు. సుగ్రీవుడికి సహాయం చేయడానికి శ్రీరాముడికి పరిచయం చేశాడు. శ్రీరాముడికి పరిచయం చెయ్యడానికి తన తెలివితేటలను ఉపయోగించాడు. చక్కని కార్యదక్షతతో రామకార్యం సాఫల్యం చేశాడు. బుద్ది కుశలత తో పనులు చక్కబెట్టడంలో హనుమంతుని మించిన వారు లేరు.
హనుమంతుడు దూరదృష్టి కలిగిన వాడు. అందుకే సుగ్రీవుడిని శ్రీ రాముని మధ్య స్నేహం కుదిర్చాడు. తర్వాత విభీషణుడు శ్రీ రాముడి మధ్య స్నేహం కుదిర్చాడు. సుగ్రీవుడు రాముడి సహాయంతో వాలిని సంహరిస్తే, విభిషణుడి సహాయంతో రావణాసుర వథ రాముడి చేతుల మీదుగా జరిగింది. దీని వెనుక హనుమంతుడి దూరదృష్టి వల్లనే ఇది సాధ్యమవుతుంది.
మొత్తం వానర సైన్యానికి హనుమంతుడే నాయకుడు. అంగదుడు సేనాపతి అయినప్పటికీ హనుమంతుడే సైన్యాన్ని ముందుకు నడిపింది తన వెంట తీసుకెళ్లగలిగాడు. హనుమంతుడిలోని నాయకత్వ లక్షణాలు అటువంటివి. కష్టాల్లోనూ నిర్భయంగా, మార్గదర్శిగా అందరి సలహాలు వింటూ లక్ష్యసాధనలో ముందుకు సాగడం వల్ల విజయం సాధించగలిగాడు. హనుమంతుడి లోని నాయకత్వ లక్షణాలే అటు స్నేహం చేసిన సుగ్రీవుడికి, తన స్వామి శ్రీ రాముడికి విజయానికి కారణమయ్యాయి.
Also read: సంధ్యా దీపం ప్రాధాన్యం: ఇంటి గుమ్మం వద్ద దీపం పెడితే కలిగే ప్రయోజనాలివే!
Chanakya Niti - చాణక్య నీతి: ఇలా సంపాదించే డబ్బు అస్సలు నిలవదు!
Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!
Hanuman Sindoor: హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక రహస్యం ఇదే
Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం
Pitru Dosha Symptoms: మీకు ఇలా జరుగుతుంటే పితృ దోషం ఉన్నట్టే !
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
మెగాస్టార్ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల
SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?