News
News
వీడియోలు ఆటలు
X

Train Ticket: జర్నీ ఇప్పుడు చేయండి, టిక్కెట్‌ డబ్బులు తర్వాత చెల్లించండి

హఠాత్తుగా రైలు ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు మీ చేతిలో డబ్బు లేకపోతే ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

FOLLOW US: 
Share:

Travel Now Pay Later: మన దేశ ప్రజల జీవితాల్లో రైలు ప్రయాణం ఒక భాగం. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 13,169 ప్యాసింజర్ రైళ్లు ‍‌(లాంగ్‌ డిస్టాన్స్‌, సబర్బన్ మార్గాల్లో) నడుస్తున్నాయి. ఇవి, దేశవ్యాప్తంగా 7,325 స్టేషన్లను కలుపుతూ 1,15,000 కి.మీ. కవర్ చేస్తుంటాయి. ప్రతిరోజూ 2.30 కోట్లకు పైగా ప్రజలు భారతీయ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైల్వేలో సగటున రోజుకు 5 లక్షల టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. వీటిలో 55% టిక్కెట్లను రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో ప్రజలు కొంటుండగా, 37% టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. 8% టికెటింగ్ ఏజెంట్ల ద్వారా జరుగుతోంది.

మీరు కూడా తరచూ రైలు ప్రయాణం చేస్తున్నా, లేదా ఎప్పుడైనా ప్రయాణం పెట్టుకున్నా, ఇప్పుడు చెప్పబోయే ముఖ్యమైన విషయాన్ని గుర్తు పెట్టుకోండి. హఠాత్తుగా రైలు ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు మీ చేతిలో డబ్బు లేకపోతే ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. 

ట్రావెల్‌ నౌ పే లేటర్‌
ప్రయాణీకులకు చేరువ కావడానికి ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలను ప్రవేశపెట్టే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), ఈసారి, డబ్బు లేకున్నా టిక్కెట్‌ బుక్‌ చేసుకునే (Train Ticket Booking) సదుపాయం తీసుకువచ్చింది. అంటే, టిక్కెట్‌ బుక్‌ చేసుకుని ఇప్పుడు ప్రయాణం చేయవచ్చు, డబ్బులు తర్వాత చెల్లించవచ్చు. ఇదీ IRCTC తీసుకొచ్చిన కొత్త స్కీమ్‌. అంటే, "బయ్‌ నౌ పే లేటర్‌ (BNPL)" లాగా "ట్రావెల్‌ నౌ పే లేటర్‌ (TNPL)" అన్నమాట.

"ట్రావెల్‌ నౌ పే లేటర్‌" సదుపాయాన్ని ప్రయాణికులకు అందించడం కోసం క్యాష్‌ఈ, పేటీఎం, ఈపేలేటర్‌తో ఐఆర్‌సీటీసీ చేతులు కలిపింది. 'క్యాష్‌ఈ'లో "ట్రావెల్‌ నౌ పే లేటర్‌" పేరిట ఈ సర్వీస్‌ కనిపిస్తుంది. పోస్ట్‌పెయిడ్‌ కింద పేటీఎంలో ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. 

పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ ద్వారా ట్రైన్‌ టిక్కెట్‌ ఎలా బుక్‌ చేసుకోవాలి?
పేటీఎం, పోస్ట్‌పెయిడ్‌ ద్వారా తన యూజర్లకు రూ. 60 వేల వరకు రుణం ఇస్తోంది. దీనిని ఉపయోగించుకుని టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. 30 రోజుల లోపు ఆ డబ్బును తిరిగి చెల్లిస్తే ఎలాంటి వడ్డీ పడదు. మీకు ఇష్టమైతే ఆ మొత్తాన్ని EMI రూపంలోకి కూడా మార్చుకోవచ్చు. పోస్ట్‌పెయిడ్‌ మొత్తాన్ని ఉపయోగించుకుని ట్రైన్‌ టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

ముందుగా, మీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో లాగిన్‌ కావాలి.
మీ ప్రయాణానికి సంబంధించిన వివరాలు పూరించాలి.
ఇప్పుడు, బుక్‌ టికెట్‌పై క్లిక్‌ చేయాలి
పేమెంట్‌ పేజీలో పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ను ఎంచుకోవాలి.
ఇప్పుడు పేటీఎం పేజీ ఓపెన్‌ అవుతుంది. 
పేటీఎం లాగిన్‌ వివరాలతో మీరు ఆ పేజీలోకి లాగిన్‌ అవ్వాలి. అంతే, టికెట్‌ బుకింగ్‌ పూర్తయినట్లే.
ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా ఎలాంటి వడ్డీ లేకుండా తిరిగి చెల్లించవచ్చు. 

క్యాష్‌ఈ ద్వారా ట్రైన్‌ టిక్కెట్‌ ఎలా బుక్‌ చేసుకోవాలి?
దీనికోసం మీ దగ్గర IRCTC రైల్‌ కనెక్ట్‌ యాప్‌ ఉండాలి. దీనిని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
ఈ యాప్‌లోకి లాగిన్‌ అయ్యి, ప్రయాణ వివరాలను పూరించాలి.
ఇప్పుడు, బుక్‌ టికెట్‌పై క్లిక్‌ చేయాలి.
పేమెంట్‌ పేజీలోకి వెళ్లగానే, ‘ట్రావెల్‌ నౌ పే లేటర్‌’ ఎంచుకోవాలి.
అక్కడ క్యాష్‌ఈని సెలెక్ట్‌ చేయాలి. దీంతో టికెట్‌ బుకింగ్‌ పూర్తవుతుంది. 
ఈ మొత్తం డబ్బును గడువులోగా, లేదా EMI రూపంలో చెల్లించే వెసులుబాటు ఉంది.

Published at : 19 May 2023 07:41 AM (IST) Tags: IRCTC TNPL Train Ticket Booking travel now pay later

సంబంధిత కథనాలు

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

UPI: ఫోన్‌ తియ్‌-పే చెయ్‌, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్‌

UPI: ఫోన్‌ తియ్‌-పే చెయ్‌, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్‌

Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - ఆటో, రియాల్టీ, మెటల్స్‌ బూమ్‌!

Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - ఆటో, రియాల్టీ, మెటల్స్‌ బూమ్‌!

Education Loan: సిబిల్‌ స్కోర్‌ తక్కువైనా ఎడ్యుకేషన్‌ లోన్‌ వస్తుంది, హైకోర్ట్‌ కీలక నిర్దేశం

Education Loan: సిబిల్‌ స్కోర్‌ తక్కువైనా ఎడ్యుకేషన్‌ లోన్‌ వస్తుంది, హైకోర్ట్‌ కీలక నిర్దేశం

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా