అన్వేషించండి

Bandi Sanjay: భజరంగ్‌దళ్‌ను బ్యాన్ చేయాలని కేసీఆర్ కుట్ర - బండి సంజయ్ వ్యాఖ్యలు

గురువారం బీజేపీ ఓబీసీ సమ్మేళనం జరిగింది. ఈ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో భజరంగ్‌దళ్‌ను నిషేధించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు.

తెలంగాణలో భజరంగ్‌దళ్‌ను నిషేధించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భజరంగ్‌ దళ్‌ను నిషేధించడంలో కాంగ్రెస్‌తో కేసీఆర్ పోటీ పడుతున్నారని మాట్లాడారు. కేసీఆర్ కుట్రను తిప్పికొట్టటానికి హిందువులంతా ఒక్కటి కావాలని పిలుపు ఇచ్చారు. గురువారం బీజేపీ ఓబీసీ సమ్మేళనం జరిగింది. ఈ సభలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రూ.1600 కోట్లతో కొత్త సచివాలయం కట్టిన సీఎం కేసీఆర్, బీసీల ఆత్మగౌరవ భవనం ఎందుకు నిర్మించటడం లేదని ప్రశ్నించారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో అంతగా ఉండబోదని స్పష్టం చేశారు. దళిత బంధులో 30 శాతం కమీషన్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని విమర్శించారు. 30 శాతం కమీషన్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని అన్నారు. వెనకబడిన వర్గాలకు చెందిన తనకు రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అవకాశం ఇచ్చిందని చెప్పారు. పాతబస్తీ ప్రజలకు రోడ్లు, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇవ్వటం‌ వెనుక కుట్ర దాగుందని ఆరోపించారు. బీసీ బంధు ప్రకటించటానికి కేసీఆర్‌కు ఇబ్బంది ఏంటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో హైదరాబాద్ వేదికగా లక్షల మందితో బీసీ శంఖారావ సభ నిర్వహిస్తామని చెప్పారు. రామ రాజ్యం కోసం ఐదు నెలల సమయం ఇవ్వాలని క్యాడర్‌కు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. కేసీఆర్ క్యాబినెట్‌లో ముగ్గురు మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారని, కేసీఆర్ కుటుంబానికి మాత్రం నాలుగు మంత్రి పదవులు ఎందుకు అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించి బీసీల పొట్ట కొట్టిందని విమర్శలు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Vijay Sai Reddy News: కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Vijay Sai Reddy News: కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Pushpa 2 Leaked: 'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - వారికి త్వరలో ఫ్రీగా వాహనాలు, తొలి ప్రాధాన్యం ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - వారికి త్వరలో ఫ్రీగా వాహనాలు, తొలి ప్రాధాన్యం ఎవరికంటే?
Pushpa 2: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
Pushpa 2 Stampede: 'మా బాబుని అంతా పుష్ప అని పిలిచేవారు' -  ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నాడంటూ ఆ తండ్రి ఆవేదన
'మా బాబుని అంతా పుష్ప అని పిలిచేవారు' - ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నాడంటూ ఆ తండ్రి ఆవేదన
Embed widget