By: ABP Desam | Updated at : 19 May 2023 07:45 AM (IST)
క్రెడిట్ కార్డ్ తీస్తే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయ్
RBI LRS: భారతీయులు, తమ క్రెడిట్ కార్డ్ ద్వారా విదేశాల్లో ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం ఇక కుదర్దు. క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణ సమయాల్లో క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే వ్యయాలకు సంబంధించి రూల్స్ మార్చింది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుల (ICC) వినియోగాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) పరిధిలోకి తీసుకువచ్చింది. దీనివల్ల, ప్రస్తుతం 5%గా ఉన్న 'మూలం వద్ద పన్ను' (Tax collection at source లేదా TCS) రేటు కాస్తా ఇకపై 20%కు చేర్చింది. అంతేకాదు, LRS పరిధిలోకి రావడం వల్ల, ఒక సంవత్సరంలో, విదేశాల్లో 2.5 లక్షల డాలర్లను దాటి క్రెడిట్ కార్డ్ ద్వారా ఖర్చు చేయాలన్నా, మరేదైనా విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించాలన్నా ఇకపై రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోవాలి. గతంలో ఈ పరిమితి లేదు. కొత్త రూల్స్ ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.
రూ.లక్ష ఖర్చు చేస్తే రూ.లక్ష 20 వేలు చెల్లించాలి
ఇంకాస్త సింపుల్‌గా చెప్పుకుందాం. ఒక భారతీయ పౌరుడు విదేశీ ప్రయాణం చేస్తున్నాడనుకుందాం. విదేశీ ప్రయాణాల్లో ఫ్లైట్ టిక్కెట్ల కొనుగోళ్లు, హోటళ్లలో బస, స్థానికంగా పర్యటనలు, ఆహారం, షాపింగ్ లాంటి ఖర్చుల కోసం అతను క్రెడిట్ కార్డ్ వాడుతుంటే దానిపై అతను 20% TCS చెల్లించాలి. అంటే, అతను విదేశాల్లో ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాలని అనుకుంటే, లక్షా 20 వేల రూపాయలు చెల్లించాలి. అదనంగా చెల్లించిన రూ. 20 వేల మొత్తం భారత ప్రభుత్వానికి చేరుతుంది. ఈ రూల్ జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది కాబట్టి, ఈ తేదీ కంటే ముందు చేసే చెల్లింపులపై ప్రస్తుతం ఉన్న 5% రేటు ప్రకారం లక్షా ఐదు వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అయితే, కంగారు పడాల్సిన పని లేదు, వాస్తవ ఖర్చుకు అదనంగా చెల్లించిన మొత్తం తర్వాత తిరిగి వస్తుంది.
గతంలో డెబిట్ కార్డ్‌లు LRS కింద ఉన్నాయి, క్రెడిట్ కార్డ్‌లు లేవు. ఈ రెండు కార్డ్‌ల రెమిటెన్స్ రేట్‌లో ఏకరూపత తీసుకురావాలనే లక్ష్యంతో LRS కిందకు అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ ఖర్చులను తీసుకురావడానికి FEMA చట్టంలో మార్పులు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అదనంగా చెల్లించిన మొత్తం ఎలా తిరిగి వస్తుంది?
ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ (ఫెమా) సవరణ నిబంధనలు-2023 ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా విదేశాల్లో చేసే ఖర్చును రిజర్వ్ బ్యాంక్ నియంత్రిస్తుంది. LRS స్కీమ్‌లో క్రెడిట్ కార్డ్ వ్యయాలను చేర్చడం వల్ల 'మూలం వద్ద పన్ను సేకరణ'ను ఇది అనుమతిస్తుంది. TCS చెల్లించే వ్యక్తి ముందస్తు పన్ను చెల్లింపుదారు అయితే, అతను ITR ఫైలింగ్ సమయంలో TCS మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన పన్నును చెల్లించవచ్చు. ముందస్తు పన్ను చెల్లింపుదారు కాకపోతే, ITR ఫైల్ చేసి ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
LRS రేటు పెంపును ఇప్పుడు కొత్తగా ప్రకటించలేదు. విదేశీ టూర్ ప్యాకేజీలు, విదేశాలకు పంపే డబ్బుపై టీసీఎస్ రేటును 5 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ప్రతిపాదించిన 2023-24 బడ్జెట్‌లోనే ప్రకటించారు. అయితే, దాని పరిధిలోకి క్రెడిట్ కార్డ్‌లను తెచ్చారా, లేదా అన్నదానిపై అప్పుడు స్పష్టత రాలేదు. ఇప్పుడు, క్రెడిట్ కార్డ్‌లు కూడా LRS పరిధిలోకి వచ్చాయని స్పష్టతనిస్తూ, ఈ నెల 16వ తేదీన ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మార్పులు జులై 1 నుంచి అమలులోకి వస్తాయి.
అయితే, విదేశాల్లో చదువు కోవడానికి, వైద్యం కోసం చేసే ఖర్చులపై TCS రేటు మారుతుంది.
FPIs: మే నెలలో ట్రెండ్ రివర్స్, డాలర్ల వరద పారించిన ఫారినర్లు
Interest Rates: వడ్డీ రేట్లు పెంచిన, తగ్గించిన బ్యాంకుల లిస్ట్ - మీ అకౌంట్ పరిస్థితేంటో చెక్ చేసుకోండి
Latest Gold-Silver Price Today 04 June 2023: వన్నె తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Petrol-Diesel Price 04 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు - కొత్త రేట్లివి
Debit Card: ఏటీఎం కార్డ్‌తో ₹5 లక్షల 'ఫ్రీ' ఇన్సూరెన్స్, ఇది అందరికీ చెప్పండి
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి