అన్వేషించండి

ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు దిగ్గజాలు - 'లాల్ సలామ్'లో రజినీతో ఇండియన్ క్రికెట్ లెజెండ్

రజినీకాంత్ ప్రస్తుతం తన కుమార్తె డైరెక్ట్ చేస్తున్న 'లాల్ సలామ్' సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఇండియన్ క్రికెట్ లెజెండ్ కూడా భాగం కానున్నట్లు రజినీ ప్రకటించారు.

ఇండియాలో క్రికెట్, సినిమాలకు ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవి మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రెండు వేర్వేరు ఎంటర్టైన్మెంట్ సాధనాలు అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ రెండు రంగాలలో నిష్టాతులైన ఇద్దరు లెజెండ్స్ చేతులు కలుపుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ లు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. 

రజినీకాంత్ ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలామ్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ లు లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. మొయిదీన్ భాయ్‌ అనే పవర్ ఫుల్ రోల్ లో రజినీ కనిపించనున్నారు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. అయితే క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో మాజీ టీమిండియా క్రికెటర్ కపిల్ దేవ్ అతిధి పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని రజినీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

''మొట్టమొదటిసారిగా క్రికెట్ ప్రపంచ కప్ గెలిచి భారతదేశాన్ని గర్వించేలా చేసిన లెజెండరీ క్రికెటర్, అత్యంత గౌరవనీయమైన అద్భుతమైన వ్యక్తి కపిల్‌ దేవ్‌ గారితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా ప్రత్యేకంగా భావిస్తున్నాను'' అని రజినీకాంత్ ట్వీట్ చేసారు. దీనికి 'లాల్ సలామ్' 'ది రియల్ కపిల్ దేవ్' అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించారు. ఈ సందర్భంగా షూటింగ్ స్పాట్‌ లో కపిల్ దేవ్ తో కలిసున్న ఓ ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్ లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇటీవల కపిల్ దేవ్ సైతం తన ఫేవరేట్స్ లో ఒకరైన రజనీకాంత్‌ ను కలిసినట్లు ఇంస్టాగ్రామ్ లో వెల్లడించారు. ‘‘గొప్ప వ్యక్తితో కలిసి ఉండటం గౌరవం, ఎంతో ప్రత్యేకం’’ అని మాజీ క్రికెటర్ తన స్టోరీలో పేర్కొంటూ, సూపర్ స్టార్ తో ఉన్న ఓ పిక్ ని షేర్ చేసారు. దీంతో వీరిద్దరి కలయిక దేని కోసమో అనే చర్చ మొదలైంది. ఇద్దరూ ఒక సినిమాలో కలిసి నటించబోతున్నారనే ఊహాగానాలు వినిపించాయి. వీటిని నిజం చేస్తూ గురువారం రజినీ కాంత్ ట్వీట్ చేసారు. కపిల్ దేవ్ బయోపిక్ గా వచ్చిన '83' సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఇప్పుడు ఈ కలయిక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 

కాగా, 'లాల్ సలామ్' అనేది ఐశ్వర్య రజనీకాంత్ ఏడేళ్ల విరామం తర్వాత దర్శకత్వం వస్తున్న సినిమా. క్రికెట్, కమ్యూనిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. విష్ణు రంగస్వామీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైంది. రజినీ - కపిల్ దేవ్ లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్. 2023 లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. 

ఇదిలా ఉంటే, రజిని కాంత్ ప్రస్తుతం 'డాక్టర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. సన్‌ పిక్చర్ బ్యానర్ లో కళానిది మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా 2023 ఆగస్టులో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత 'జై భీమ్' ఫేమ్ దర్శకుడు TJ జ్ఞానవేల్‌ తో రజినీ ఓ సినిమా చేయనున్నారు. అలానే 'విక్రమ్' ఫేమ్ లోకేష్ కనగరాజ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయనున్నారని సమాచారం. 

Read Also: రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? అదే సూపర్ స్టార్ లాస్ట్ మూవీనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget