అన్వేషించండి

Nizamabad: యాసంగికి వరి తప్ప వేరే పంటలు వేయలేం.. నిజామాబాద్ జిల్లా ఆవేదన

యాసంగిలో వరి తప్ప వేరే పంట వేయలేం, ప్రత్యామ్నయ పంటలు వేసేందుకు విత్తనాలు కూడా లేవు, ఇంకా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టని అన్నదాతలు,  ఇప్పటికే ముగిసిన పలు పంటల సాగు సమయం, ఏం చేయాలో పాలుపోని రైతులు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగిలో వరి పంట వేయొద్దని ప్రభుత్వం చెప్పేయడంతో... అన్నదాతలకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. యాసంగి పంట వేసేందుకు సమయం కూడా మించిపోతోంది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ సారి యాసంగికి ఎలాంటి వరి కొనుగోళ్లు చేపట్టేది లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. జిల్లాలో వరి పండించే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు తప్ప మరోమార్గం లేని పరిస్థితి ఎదురైంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే అక్టోబరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించారు. పప్పుదినుసులు, ఆకు కూరలు, కూరగాయలు, ఉద్యాన పంటలు, ఇతర వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని వివరించారు. మెజార్టీ రైతులు వరి పంటనే నమ్ముకున్నారు. ఖరీఫ్ తర్వాత యాసంగి ఇలా సంప్రదాయంగా పంటలు వేస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నామని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు.

వరే వేస్తాం, ప్రత్యామ్నయం వైపు వెళ్లం

నిజామాబాద్ జిల్లాలో దాదాపు 70 శాతం మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ వరి పంటను ఎక్కువగా పండిస్తారు. మొక్కజొన్న, జొన్న, కూరగాయలు వంటి వాణిజ్య పంటలు తక్కువ విస్తీర్ణంలో పండిస్తారు. దాదాపు 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే గత యాసంగిలో దాదాపు 3 లక్షల 74 వేల ఎకరాల్లో వరి పండించారు. ఈసారి యాసంగిలో వరి వేయొద్దని ప్రభుత్వం తేల్చిచెప్పటంతో రైతులు ఆయోమయంలో ఉన్నారు. జిల్లాలో సాధారణంగా రైతులు వరి పంటపైనే ఆసక్తి చూపుతారు. జిల్లాలో నిజాంషుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డ తర్వాత మెజార్టీ రైతులు వరి పంటనే సాగు చేస్తున్నారు. గతంలో ఖరీఫ్ పంట వేసి తర్వాత రైతులు యాసంగిలో చెరుకు పంటకు వెళ్లేవారు. అయితే ఫ్యాక్టరీ మూతపడటంతో రైతులు వరినే పండిస్తున్నారు. దీంతో ఖరీఫ్, యాసంగిలో పూర్తిగా వరి పంటనే వేస్తున్నారు. ఈ సారి జిల్లాలో సంవృద్ధిగా వర్షాలు కూడా కురవటంతో ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు ఉండటం.... భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు వరిపంటవైపే మొగ్గుచూపుతారు. కానీ ఆరుతడి పంటలు వేసేందుకు ఇది సమయం కూడా కాదని ఆందోళన చెందుతున్నారు.

అగమ్య గోచరంగా రైతుల పరిస్థితి

వరి పంటను కాదని వేరే పంటల వైపు వెళ్దామన్నా.... విత్తనాల కొరత. మరోవైపు వరి పంటకు అలవాటైన నేల ఇప్పటికిప్పుడు ఇతర పంటలు వేస్తే దిగుబడి వచ్చే అవకాశాలు లేవని రైతులు అంటున్నారు. ఈ సారి యాసంగికి వరి సాగుకు అనుమతిచ్చి వచ్చేసారి నుంచి ఇతర పంటల వైపు మొగ్గుచూపుతాం. కానీ ఇలా ఉన్నట్లుండి సడన్ వరి పంటను వెెయ్యొద్దంటే తమ పరిస్థితి ఏంటని రైతులు వాపోతున్నారు. వరి పంట వేస్తే ఒక వేళ ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే పరిస్థితేంటన్న ఆందోళనలో కూడా ఉన్నారు రైతులు. ఇతర పంటలు వైేద్దామంటే పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో అన్న మీమాంసలో ఉన్నారు. రైతుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ప్రత్యామ్నయ పంటలపై వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కూడా కల్పించలేదన్న వాదన రైతుల్లో వినిపిస్తోౌంది. గతేడాది మొక్కజోన్న పంట వేసినా కొనబోమని ప్రభుత్వం చెప్పటంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇటు మొక్కజోన్న వైయాలా లేక వరి వేయాలా అసలేం చేయాలన్నది రైతులకు పాలుపోవటం లేదు.

Also Read: శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?

Also Read: కాల్ సెంటర్ పెట్టారు.. కోట్లు దోచారు ! అతి పెద్ద మోసగాళ్ల ముఠాను పట్టేసిన సైబరాబాద్ పోలీసులు..

Also Read: వివేకా హత్య కేసులో కీలక మలుపు .. హైకోర్టులో ఎర్ర గంగిరెడ్డి క్వాష్ పిటిషన్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget