SBI Crime : కాల్ సెంటర్ పెట్టారు.. కోట్లు దోచారు ! అతి పెద్ద మోసగాళ్ల ముఠాను పట్టేసిన సైబరాబాద్ పోలీసులు...
సైబరాబాద్ పోలీసులు స్ఫూఫింగ్ ముఠాను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఎస్‌బీఐ కాల్ సెంటర్ పేరుతో ఫోన్లు చేసి కస్టమర్లను కోట్లలో ముంచేశారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా మాట్లాడి ఆ బ్యాంక్ కస్టమర్లను మోసం చేస్తున్న ఘరానా ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారు చేసిన మోసాలు.. చేసిన తీరును సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా కార్పొరేట్ తరహాలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని స్ఫూఫింగ్‌లో రాటుదేలిపోయిన సిబ్బందిని నియమించుకుని .. ట్రైనింగ్ ఇచ్చి మరీ మోసాలు చేస్తోంది ఈ ముఠా.
Also Read : స్నేహితులతో కలిసి భార్యను కిడ్నాప్ చేయించిన భర్త.. అర్ధరాత్రి కారులో ఎత్తుకెళ్లి..
మీరు ఎస్‌బీఐ కస్టమర్లు అయితే... ఎస్‌బీఐ ధనీ బజార్, ద లోన్ ఇండియా, లోన్ బజార్ పేర్లతో ఎప్పుడో ఓ సారి కాల్ అందుకునే ఉంటారు. ఆ కాల్ కూడా ఎస్‌బీఐ కాల్ సెంటర్ నెంబర్ దే అయి ఉంటుంది. 1860 180 1290 నెంబర్ నుంచి కాల్ వస్తున్నట్లుగా చూపించేలా స్ఫూపింగ్ యాప్ ద్వారా ఎస్‌బీఐ అసలైన కస్టమర్ కేర్ నుంచే ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడ్డారు. ఈ కాల్ సెంటర్ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ఏర్పాటు చేసుకున్నారు.
Also Read : శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?
ఒక్క హైదరాబాద్ వారికే కాకుండా.. దేశవ్యాప్తంగా ఏడాదిలో 33 వేల కాల్స్ చేశారు. ఎస్‌బీఐ కస్టమర్ల ఖాతాల నుంచి రూ. కోట్లు కొల్లగొట్టారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదయ్యాయి. స్‌బీఐ ఏజెంట్ల నుంచి ఖాతాదారుల వివరాల తీసుకొని క్రెడిట్‌కార్డు దారుల నుంచి ముఠా డబ్బులు కాజేస్తున్నట్లుగా స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. 1860 180 1290 అనే నంబరును స్ఫూపింగ్ చేశారు.14 మంది నిందితులను అరెస్టు చేసి 30సెల్‌ఫోన్లు, 3ల్యాప్‌టాప్‌లు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు.
రుణాలు ఇప్పిస్తామని మోసం చేసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ధనీ, లోన్ బజార్ పేరుతో రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాక వ్యక్తిగత వివరాలు తీసుకొని ఆ తర్వాత రుణం మంజూరైనట్లు చెబుతారని.. ప్రొసెసింగ్ ఫీజు పేరిట అధిక మొత్తంలో నగదు తీసుకుంటున్నారు.. తర్వాత స్పందించడం మానేస్తున్నారు.
Also Read : వాహన రిజిస్ట్రేషన్లనూ వదల్లేదు... నకిలీ బీమా పాలసీలతో ప్రభుత్వ ఆదాయానికి గండి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి