అన్వేషించండి

Nizamabad News: రసవత్తరంగా నిజామాబాద్‌ జిల్లా రాజకీయాలు- పోటాపోటీగా ఆపరేషన్ ఆకర్ష్‌

నిజామాబాద్ జిల్లాలో రసవత్తరంగా రాజకీయాలు. ఆపరేషన్ ఆకర్ష్ లో నేతలు బిజీబిజీ. పోటాపోటీ బీజేపీ, టీఆర్ఎస్ ఆకర్ష్. రెండు పార్టీల్లో నాయకుల జంపింగ్ లు.

నిజామాబాద్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయ్. బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా నాయకులను పార్టీల కండువా కప్పేస్తున్నారు. టీఆరెస్ పార్టీ బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తుంటే... బీజేపీ అధికార పార్టీ నాయకులను ఆహ్వానిస్తోంది. గత కొన్ని రోజులుగా అధికార పార్టీ, బీజేపీ రెండు పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ లో ముందుంటున్నాయ్. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులను టార్గెట్ చేసింది.

నిజామాబాద్ నగరంలోని 33వ డివిజన్ బీజేపీ కార్పోరేటర్ మల్లేష్ గౌడ్ ఎమ్మెల్సీ కవిత సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ మరుసటి రోజే బీజేపీ సైతం టీఆర్ఎస్ నాయకుడు మోహన్ రెడ్డికి అధికార పార్టీకి రాజీనామా చేయించిందని తెలుస్తోంది. బోధన్ నియోజకవర్గ నాయకుడిగా మోహన్ రెడ్డికి మంచిపట్టుంది. అయితే మోహన్ రెడ్డి బాహటంగానే బీజేపీ పార్టీలోకి చేరబోతున్నట్లు ప్రకటించారు. 

గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి 28 మంది కార్పోరేటర్లు విజయం సాధించారు. అయితే టీఆర్ఎస్ పార్టీ బీజేపికి చెందిన 10 మంది కార్పోరేటర్లను ఇప్పటికే లాగేసుకుంది. అన్ని నియోజవకర్గాల్లోనూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆపరేషన్ ఆకర్షన్ ఉద్ధృతం చేశారు. ఆర్మూర్ 3 నెలల కింద టీఆర్ఎస్‌కు చెందిన కొంత మంది కీలక నేతలు బీజేపీ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ పార్టీలకు చెందిన చాలా మంది సెకండ్ క్యాడర్ నాయకులను కారు పార్టీలోకి చేర్చుకున్నారు. 

టీఆర్ఎస్ పార్టీ మొదట్నుంచి ఇతర పార్టీల నాయకులను భారీగా ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం కార్పోరేటర్లపై గులాబీ పార్టీ గురి పెట్టింది. బీజేపీకి చెందిన కార్పోరేటర్లను ఒక్కొక్కరిని టీఆర్ఎస్ నాయకులు కారెక్కిస్తున్నారు. దీంతో జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూగా మారింది. రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయ్. ఎప్పుడు ఏ నేత ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారుతున్నారనేది తెలియటం లేదు. సడన్‌గా  పార్టీలు మార్చేస్తున్నారు నాయకులు.

ఆపరేషన్ ఆకర్ష్‌పై టీఆర్ఎస్ ఎక్కువ ఫోకస్ పెట్టడంతో బీజేపీ కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్లు పార్టీలోకి టీఆర్ఎస్ నాయకులను ఆహ్వానిస్తోంది. బీజేపీ సైతం టీఆర్ఎస్‌లో ఉన్న కీలక నేతలపై కన్నేసింది. ఉద్యమంలో పోరాడిన నాయకులను, టీఆర్ఎస్ పార్టీలో పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న లీడర్స్‌ను బీజేపీ ఆకర్షిస్తోంది. రానున్న రోజుల్లో ఈ చేరికలు మరింత ఎక్కువగా ఉంటాయని ఇరు పార్టీల నేతలు బాహటంగానే చెప్పుకుంటున్నారు.

అధికార పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కూడా పార్టీలని మరింత బలోపేతం చేసేందుకు కీలక సమాజిక వర్గాలపై దృష్టి పెట్టారు. మరింత బలోపేతం చేసేందుకు కీలక సామాజిక వర్గం నాయకులపై కన్నేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ రెండు పార్టీల నాయకులు మాత్రం గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇటు బీజేపీ బలం లేని నియోజకవర్గాల్లో పేరున్న నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. టీఆర్ఎస్‌లో వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదేమో అనుకునే నేతలు బీజేపీ నాయకులతో టచ్‌లో ఉంటున్నారన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి జిల్లాలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నాయకులు ఆపరేషన్ ఆకర్ష్ లో బిజీ అయ్యారని తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Kumuram Bheem Asifabad Latest News: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో SIR ప్రారంభం- ముందు తమది ఏ రాష్ట్రమో తేల్చాలని ప్రజల డిమాండ్ 
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో SIR ప్రారంభం- ముందు తమది ఏ రాష్ట్రమో తేల్చాలని ప్రజల డిమాండ్ 
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget