By: ABP Desam | Updated at : 21 Dec 2021 03:45 PM (IST)
చిరుత సంచారం
ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుత సంచారం రైతులను, ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మాక్లూర్ మండలం సింగంపల్లి తండాలో రైతులు పొలం వెళ్తుండగా వారికి చిరుత కనిపించింది. దీంతో సదరు రైతు తనసెల్ ఫోన్‌లో చిరుత పరుగెడుతున్న విజువల్స్ తీశాడు. ఆ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామల ప్రజలకు చిరుత వీడియోను షేర్ చేసి అలర్ట్ చేశాడు.
చిరుత సంచారం గురించి ఆటవీ శాఖ అధికారులకు తెలిపారు సింగంపల్లి గ్రామస్థులు. ఆర్మూర్ నియోజకవర్గంలోని జక్రాన్ పల్లి, మాక్లూర్ మండలాల్లోని అటవీ ప్రాంతంలో చాలా సార్లు స్థానికులకు చిరుత కనిపించింది. జాక్రాన్ పల్లి మండలం తొర్లికొండ శివారు ప్రాంతంలోనూ పలు మార్లు చిరుత సంచరించింది. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి, సింగంపల్లి, మాదాపూర్ గ్రామాల్లోనూ చిరుత లేగదూడలు, మేకలపై దాడులు చేసిన సందర్భాలున్నాయ్. గతేడాది మాక్లూర్ మండలం మాదాపూర్‌లోని రాళ్లగుట్టపై చిరుత కనిపించింది. ఈ ఏడాది చిన్నాపూర్ లో చిరుత మేకలపై దాడి చేసి చంపింది. దీంతో అటవీశాఖ అధికారులు చిరుత సంచరించిన ప్రాంతాల్లో మేక, కుక్కను ఎరవేసి బోను సైతం ఏర్పాటు చేశారు. కానీ చిరుత చిక్కలేదు.
మొన్నటికి మొన్న నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో చిరుత ఓ పర్యాటకుడికి కనిపించింది. మరోవైపు నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి 44పై కూడా చిరుత సంతరించటంతో ప్రజలు బయపడుతున్నారు. నిత్యం ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతాల్లోని రైతులు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. మేకలు, గొర్లకాపరులు సైతం మాదాపూర్, చిన్నాపూర్, సింగంపల్లి అటవీ ప్రాంతాల్లోకి వెళ్లాలంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఎలాగైనా చిరుతను పట్టుకోవాల్సిందిగా ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Also Read: పవర్ స్టార్ అభిమానులకు నిర్మాత సారీ... పవన్ చెప్పడం వల్లే!
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
Also Read: అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
Also Read: బాలయ్య దగ్గరకు అల్లు అర్జున్ వస్తున్నాడు... రవితేజ వెనక్కి వెళ్లాడు!
Also Read: పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి రేసు నుంచి 'భీమ్లానాయక్' ఔట్..
Also Read: 'పుష్ప' సినిమా రేటింగ్స్.. విమర్శలపై 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ కామెంట్స్..
Also Read: సెక్సీగా కనిపించడం కోసం ఎంత కష్టపడ్డానో.. 'పుష్ప' ఐటెం సాంగ్ పై సామ్ రియాక్షన్..
Also Read: SBI FD Rates: గుడ్‌న్యూస్..! ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన ఎస్‌బీఐ
Also Read: New Online Payment Rules: జనవరి 1 నుంచి ఆన్‌లైన్ పేమెంట్ నిబంధనల్లో మార్పు.. తెలియకపోతే కష్టం!
Also Read: Multibagger stock: ఐదేళ్లు: ఈ షేరులో లక్షకు రూ.5 లక్షల లాభం!
Also Read: Stock Market: రూ.2,61,812 కోట్లు పతనమైన టాప్-10 కంపెనీల మార్కెట్ విలువ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం
KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఎవరు? అంచనాలు ఆయన అందుకుంటారా?
11 మందికి శాఖలు కేటాయించిన రేవంత్- సీఎం వద్దే హోం శాఖ
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>