(Source: ECI/ABP News/ABP Majha)
Viral News: నిర్మల్ జిల్లాలో ఏటీఎంలో చోరీకి యత్నం, గంటలో దొంగను అరెస్టు చేసిన పోలీసులు
Nirmal News | ఏటీఎంలో చోరీకి యత్నించిన ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంక్ మేనేజర్ నుంచి కాల్ రావడంతో తక్షణమే స్పందించిన పోలీసులు గంటల వ్యవధిలో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ATM Robbery Nirmal | నిర్మల్ : గతంలో ఇళ్లల్లో చోరీలు చేసేవాళ్లు. అందుకోసం ఇళ్లల్లో ఎవరూ లేని టైమ్ చూసి, పండుగలకు వేరే ఊరుకు వెళ్లిన సమయంలో దొంగలు పడి చోరీ చేసేవారు. ఆ మధ్యకాలంలో పర్సులు కొట్టేసేవాళ్లు, ఆపై సెల్ ఫోన్లు, ఇతర వస్తువులు చోరీలు చేసేవాళ్లు దొంగలు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఏటీఎంలను టార్గెట్ చేసి చేస్తున్న చోరీలు సైతం అధికం అయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లా (Nirmal District)లో జరిగింది. ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన ఓ దొంగను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు.
అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి యత్నం
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏటిఎంలో ఓ యువకుడు దొంగతనానికి యత్నించాడు. శనివారం (నవంబర్ 2న) తెల్లవారుజామున నిర్మల్ పట్టణంలోని కెనరా బ్యాంక్ మేనేజర్ 100 డయల్ కి కాల్ చేసి డాక్టర్ లైన్లో ఏటీఎంలొ ఎవరో గుర్తుతెలియని వ్యక్తి దొంగతనానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. వెంటనే పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. వెంటనే అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నిర్మల్ బస్టాండ్ దగ్గర అతడని గుర్తించి పట్టుకున్నారు. వెల్మెల్ బొప్పారం గ్రామానికి చెందిన కుంచం గంగాధర్ అనే వ్యక్తిగా గుర్తించారు. అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. 100 డైల్ కాల్ కి తక్షణమే స్పందించి చాకచక్యంగా దొంగని పట్టుకున్న ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ని జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ప్రశంసించారు. సకాలంలో పోలీస్ సేవలను ఇలాగే అందరూ బాధ్యతయుతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఎవరైనా మీకు అనుమానంగా కనిపించినా, చిన్న పిల్లలను తీసుకెళ్తున్నట్లు గమనిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు ఆమె సూచించారు. అంతా బాధ్యతగా ఉన్నప్పుడు నిందితులను పట్టుకోవడం తేలిక అవుతుందని చెప్పారు.
Also Read: Crime News: 'పుష్ప' సీన్ రిపీట్ - ఎర్రచందనం స్మగ్లింగ్‌ను మించేలా, కాకపోతే ఇక్కడ గంజాయి