Nizamabad News: ఆ ఊరిలో తొలి మొక్కులు గాంధీజీకే- అనాధిగా వస్తున్న ఆచారం
మాకు తొలి దైవం మహాత్ముడే. ఊళ్లో ఏ శుభ కార్యం జరగాలన్నా మొదట గాంధీజేకే పూజలు. ఊళ్లో నర్సింహస్వామి ఆలయం తర్వాత తొలి పూజలు మహాత్మునికే. గాంధీజీని దైవంలా భావిస్తున్న గ్రామస్థులు.
మహాత్మా గాంధీని ఈ గ్రామస్థులు ఏ శుభకార్యం జరిగినా ఎందుకు ఆయన్ను పూజిస్తారు. ఈ అఛారం ఎలా వచ్చిందన్న విషయాలు చాలా ఆసక్తి కలిగిస్తాయ్. ఈ గ్రామంలోని చావడిలో 1961 గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు భూమిపూజ చేశారు. అలా చేస్తున్న సమయంలో ఆ గ్రామంలోని ఓ వ్యక్తికి కొడుకు పుట్టాడు. భూమిపూజ చేస్తున్న సమయంలో బాబు పట్టడంతో గ్రామస్థులంతా సంతోషించారు. ఇది శుభ పరిణామంగా భావించిన గ్రామస్థులు అనాటి నుంచి ఊళ్లో ఏ శుభకార్యం అంటే ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నా... ఫస్ట్ గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి కొబ్బరికాయ కొట్టాల్సిందే. అయితే భూమి పూజ రోజు పుట్టిన చిన్నారికి గ్రామస్థులంతా కలిసి మహాత్మాగాంధీ అని పేరు పెట్టారు. ఎక్కడా లేని విధంగా గాంధీజీని దైవంగా భావిస్తున్నారు నర్సింగ్ పూర్ గ్రామస్థులు. ఊళ్లో పెళ్లిళ్లైనా ... పేరంటాళ్లైనా... ఏ పండగైనా ... ఫస్ట్ గాంధీజీకి పూజలు చేస్తామని చెబుతున్నారు గ్రామస్థులు..
చూసేవారికి కాస్త ఆశ్చర్యం కలిగినా... నర్సింగ్ పూర్ గ్రామస్థులు అనాధిగా వస్తున్న ఆచారాన్ని మాత్రం తూచాతప్పకుండా పాటిస్తున్నారు. దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజు మహాత్మున్ని అందరూ స్మరించుకుంటారు. కానీ ఈ గ్రామస్థులు మాత్రం నిత్యం ఈ మహాత్మునికి పూజలు నిర్వహించుకుంటున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పోరాడిన గాంధీజీని నర్సింగ్ పూర్ గ్రామస్థులు దైవంతో సమానంగా ఆరాధిస్తారు.