News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kamareddy News: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ కౌన్సిలర్లకు రైతుల వినతి పత్రాలు

Kamareddy News: కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ.. 49 మంది కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ రైతులు వినతి పత్రాలు అందజేశారు. 

FOLLOW US: 
Share:

Kamareddy News: కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ తో తమ జీవనాధారమైన భూములను కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ.. కౌన్సిలర్ల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ వినతి పత్రాలు అందజేశారు. గత నెల రోజులుగా రైతులు.. ఈ విషయంపై ఆందోళన బాట పట్టారు. మాస్టర్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వివరణ ఇచ్చినా... రైతులు నమ్మడం లేదు. మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలకు ఈ నెల 11 వరకు గడువు ఉండటంతో కౌన్సిల్ తీర్మానంలో సంతకాలు చేసి ఆమోదం తెలిపిన 49 మంది మున్సిపల్ కౌన్సిలర్లకు ముసాయిదాను రద్దు చేస్తూ.... తీర్మానం చేయాలని వినతి పత్రాలు అందజేశారు. కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి నేరుగా కలిసి మరీ మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి అందుబాటులో లేకపోవడంతో ఆమె తండ్రి నిట్టు వేణుగోపాల్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. 

కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి జీఓ నంబర్ 478 ప్రకారం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం నంబర్ 4/407 తేదీ 23.07.2021 రోజున ఆమోదించిన ప్రకారం కామారెడ్డి పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే దాన్ని రద్దు చేయాలంటూ గత నెల రోజులుగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తున్నారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్  తెలిపిన వివరాల  ప్రకారం కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందింది. అయితే మాస్టర్ ప్లాన్ విషయంలో పురపాలక సంఘానికి 1026 అభ్యంతరాలు వచ్చాయని కలెక్టర్  తెలిపారు. అభ్యంతరాలకు చివరి తేదీ జనవరి 11, 2023 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నందున...  రైతులు నష్టపోకుండా ఉండడం కోసం జనవరి 12, 2023 రోజున పురపాలక సంఘం అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలోనే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ.... తీర్మానం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. 

దయచేసి 49 మంది కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన ఉండి, తమకు సహకరించాలని కోరారు. తామ నష్టపోకుండా ఉండేలా, తమ కుటుంబాలను ఆదుకోవాలని. ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీవనాధారమైన భూమిల్ని కౌన్సిలర్లంతా కాపాడాలని కోరుతూ వినతి పత్రంలో వేడుకున్నారు. మంగళవారం ఒక్క రోజు రైతుల ఉద్యమానికి ఐక్య కార్యాచరణ కమిటీ విరామం ప్రకటించింది. 11 వ తేదీన శాంతియుతంగా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయనున్నారు.

భయపడాల్సి అవసరం లేదు: కామారెడ్డి కలెక్టర్

కామారెడ్డి పట్టణ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రాథమిక దశలో ఉందని.. ఇందుకోసం డ్రాఫ్ట్ తయారు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ మూడ్రోజుల క్రితమే తెలిపారు. ఇందులో అభ్యంతరాలకు నవంబర్ 13వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు 60 రోజులు సమయం ఇస్తున్నామని స్పష్టం చేశారు. అభ్యంతరాలను, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రైతులు తమ భూములు పోతున్నాయనే అపోహలు వదలాలని అన్నారు. గతంలో 2000 సంవత్సరంలో కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పెరుగుతున్న పట్టణ పరిధికి తగ్గట్టు మాస్టర్ ప్లాన్ కూడా మారుతుందని ఆయన వివరించారు. ఫిర్యాదులు ఇవ్వాలంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఇవ్వాలని కలెక్టర్ చెప్పుకొచ్చారు. మార్పులు, చేర్పులు అయ్యాక ఫైనల్ కు వెళ్తుందని వెల్లడించారు.

Published at : 09 Jan 2023 04:15 PM (IST) Tags: Kamareddy News Kamareddy Collector Kamareddy Collector Jitesh V Patil Master Plan Issue Kamareddy Farmers

ఇవి కూడా చూడండి

Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ భరోసా

KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ భరోసా

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Polling 2023 LIVE Updates:  తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత