Kamareddy News: హైవే 44పై కారు బోల్తా.. బయటపడ్డ గంజాయ్ డంప్
డివైడర్‌కు ఢీ కొని కారు బోల్తా పడింది. అందులో తొంగి చూస్తే గంజాయి వెలుగు చూసింది. ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారులు షాక్ తిన్నారు.
కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. 44 నెంబర్ జాతీయ రహదారిపై ఓ ఇన్నోవా కారు బోల్తా పడింది. ప్రమాదంలో చిక్కుకొని గాయపడ్డ వారిని రక్షిద్దామని లోకల్స్ పరుగుపరుగు కారు దగ్గరకు వెళ్లారు. అప్పటికే అందులో ఉన్నవాళ్లంతా పారిపోయారు. కారులో ఏముందోనని చూసిన వాళ్లకు షాక్ తగిలింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.
జాతీయ రహదారి 44పై వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు బోల్తా కొట్టింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న UP 14 BQ 1030 నెంబర్ గల కారు పల్టీలు కొట్టింది. టైరు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు చూసి అక్కడకు చేరుకునే సరికి అందులో మనుషులు లేరు. ఏవో ప్యాకెట్లు ఉన్నాయి. కచ్చితంగా ఇదేదో అనుమానించదగ్గదేనని గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకొని ప్రమాద స్థలానికి వచ్చిన పోలీసులు అసలు విషయం వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ కారులో ఉంది గంజాయి అని తేల్చారు. గంజాయితో వెళ్తున్న వెహికల్ ప్రమాదానికి గురైందని... అందులో మత్తమందు గంజాయి ఉండటంతో అందులోని వారు పారిపోయినట్టు గుర్తించారు పోలీసులు.
వాహనంలో వెనుక సీట్లలో గంజాయి ప్యాకెట్లను గుర్తించారు పోలీసులు. మద్యం బాటిళ్లు కూడా దొరికాయి. సంఘటనా స్థలానికి దేవునిపల్లి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. కారు ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు. గంజాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు.
వెహికల్ నిజామబాాద్ వైపు వెళ్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు అక్కడ గంజాయి విక్రయించేవారిని అదుపులోకి తీసుకని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొనే గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన బాలయ్య.. ఆ పని అద్భుతమని ప్రశంసలు
Also Read: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ఇక అక్కడ కూడా మీ పరువు పోయినట్టే..! పోలీసుల కొత్త ఐడియా
Also Read: రేవంత్ హౌస్ అరెస్టు.. అన్ని దారులు మూసేసిన పోలీసులు.. ‘కేసీఆర్‌కి ఎందుకీ భయం’ అంటూ ట్వీట్
Also Read: PM Modi Mann ki Baat: మోదీ నోట తెలంగాణ వ్యక్తి పేరు.. మన్ కీ బాత్‌లో ప్రత్యేక ఆకర్షణ, ఎందుకో తెలుసా?
Also Read:అఖిల్ 'బీస్ట్' లుక్.. ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఫ్యాన్స్ షాక్..
Also Read: పాముతో పాటేసుకుంది.. దానికి తిక్కరేగి కాటేసింది.. ప్రముఖ సింగర్‌కు చేదు అనుభవం
Also Read:తమన్ కి క్రేజీ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. 'రాధేశ్యామ్' బీజియమ్ అదిరిపోవాలంతే..
Also Read: త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లో నవీన్.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..