Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ఇక అక్కడ కూడా మీ పరువు పోయినట్టే..! పోలీసుల కొత్త ఐడియా
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన మందుబాబులకు వారు పని చేస్తున్న కంపెనీలకు ఉద్యోగుల ఘన కార్యం తెలుపుతూ రాచకొండ ట్రాఫిక్ పోలీసులు లేఖ రాశారు.
తాగి వాహనాలు నడిపే వారిని అరికట్టేందుకు పోలీసులు అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. మొదట్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ఫైన్ వేసేవారు. తర్వాత ఆ ఫైన్లు భారీగా పెంచడం, కేసు నమోదు చేయడం, తల్లిదండ్రులతో సహా కౌన్సెలింగ్‌కు హాజరుపర్చడం వంటివి చేశారు. పదే పదే అలా పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తున్నారు. తాజాగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను అరికట్టడం కోసం రాచకొండ పోలీసులు మరో కొత్త ఐడియా అమలు చేస్తున్నారు.
మందు బాబులను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన మందుబాబులకు వారు పని చేస్తున్న కంపెనీలకు ఉద్యోగుల ఘన కార్యం తెలుపుతూ రాచకొండ ట్రాఫిక్ పోలీసులు లేఖ రాశారు. దీనివల్ల వారు పరువు పోయినట్లుగా ఫీల్ అయి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. రోడ్డు భద్రతపై తమ ఉద్యోగులకు అవగాహన కల్పించాలని ఆ లేఖలో కంపెనీలకు సూచించారు.
ఈ నెల 18 నుంచి 24 వరకు మధ్య రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 413 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లుగా పోలీసులు ప్రకటించారు. వీటి ద్వారా రూ.8,47,500 జరిమానాలు వసూలయ్యాయి. వీరిలో 20 మందికి కోర్టులు జైలు శిక్షను కూడా విధించాయి. మరోవైపు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన 34,042 మందిపై కేసులు నమోదు చేశారు. వీరికి రూ.1,37,28,710 జరిమానా విధించారు. వీటిలో అత్యధికం హెల్మెట్ లేని కేసులే ఉన్నాయి. ఈ కేసులు మొత్తం 19,866 కాగా.. వీరి ద్వారా రూ.36,45,300 సొమ్ము జరిమానాల ద్వారా వసూలు అయింది. వారం రోజుల వ్యవధిలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో వందకు పైగా రోడ్డు ప్రమాద కేసులయ్యాయి. వీటిల్లో 15 మంది మరణించగా 88 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. సీటు బెల్ట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపిన వారిపై 130 కేసులు నమోదు చేసి, 13,000 రూపాయలు జరిమానా విధించారు.
Also Read: Hyderabad: తల్లి కళ్లెదుటే కొడుకుల రక్తపాతం.. ఒకరు మృతి, కదల్లేని స్థితిలోనే మౌనంగా రోదిస్తూ..
Also Read: కరోనాకు నాటు వైద్యం చేయిస్తామని బాలికతో వ్యభిచారం... 13 మందిని అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు
Also Read: డ్రగ్స్ కేసు భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్