(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad: తల్లి కళ్లెదుటే కొడుకుల రక్తపాతం.. ఒకరు మృతి, కదల్లేని స్థితిలోనే మౌనంగా రోదిస్తూ..
పక్షవాతంతో కొన్నేళ్లుగా ఓ తల్లి మంచానికే పరిమితమైంది. ఇద్దరు కుమారులు తాగిన మైకంలో ఆమె కళ్లెదుటే విపరీతంగా ఘర్షణ పడ్డారు. నిస్సహాయ స్థితిలోని ఆమె వారిని కనీసం వారించలేకపోయింది.
అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్ల మధ్య సోదరసోదరీమణుల బంధం బాగుండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. కొడుకులు లేదా కుమార్తెలు ప్రయోజకులై పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తుంది. వారి మధ్య ఏవైనా మనస్పర్థలు లేదా గొడవలు తలెత్తితే ఏ తల్లి మనసైనా నిలకడగా ఉండదు. వారు బాగుండాలని నిత్యం పరితపిస్తుంటుంది. కానీ, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన మాత్రం కన్నీరు పెట్టించేలా ఉంది. సొంత అన్నాదమ్ముళ్లు మద్యం మత్తులో ఒకర్నొకరు కొట్టుకొని ఒకరిని హతమార్చిన ఘటన వెలుగు చూసింది. ఇదంతా తల్లి కళ్లెదుటే జరుగుతున్నా.. వారిని వారించి ఏ మాత్రం ఆపలేని దీన స్థితిలో ఆమె ఉండడం, హృదయాన్ని కదిలిస్తోంది.
హైదరాబాద్ శివారు దుండిగల్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పక్షవాతంతో కొన్నేళ్లుగా ఓ తల్లి మంచానికే పరిమితమైంది. ఇద్దరు కుమారులు తాగిన మైకంలో ఆమె కళ్లెదుటే విపరీతంగా ఘర్షణ పడ్డారు. నిస్సహాయ స్థితిలోని ఆమె వారిని కనీసం వారించలేకపోయింది. ఈ కొట్లాటలో పెద్ద కుమారుడు మృతి చెందాడు. విషయం ఎవరికి చెప్పాలో తెలియక కొడుకు మృతదేహం పక్కనే కదల్లేని స్థితిలో కొన్ని గంటల పాటు ఆమె మౌనంగానే గుండెలు పగిలేలా రోదించింది.
Also Read:టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు
విశాఖపట్నానికి చెందిన వెంకట శ్రీమన్నారాయణ, వరలక్ష్మి దంపతులు. చాలా ఏళ్ల క్రితం ఉద్యోగరీత్యా వీరు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. వీరికి భరత్, సాయితేజ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పనిచేసిన శ్రీమన్నారాయణ కొద్దికాలం క్రితం చనిపోయారు. వరలక్ష్మి పదేళ్ల నుంచి పక్షవాతంతో మంచానికే పరిమితం అయింది.
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం
ఈ క్రమంలో ఇద్దరు కుమారులు బాధ్యత లేకుండా జులాయిగా తిరగడం మొదలుపెట్టారు. ఫూటుగా మద్యం తాగి మత్తులో తరచూ ఇద్దరూ గొడవ పడేవారు. శుక్రవారం రోజు రాత్రి కూడా అన్న భరత్‌తో తమ్ముడు సాయితేజ్ ఘర్షణ పడ్డాడు. వంటింట్లోని కుక్కర్ తీసుకుని తలపై బలంగా కొట్టడంతో అన్న కింద పడిపోయాడు. తర్వాత మత్తులో ఉన్న తమ్ముడు తల్లి మంచం పక్కనే నేల మీద పడిపోయి అలాగే నిద్రపోయాడు. శనివారం ఉదయం లేచి చూసేసరికి అన్న చనిపోయి ఉండడం గుర్తించి, భయంతో ఇంట్లో నుంచి పారిపోయాడు. తర్వాత సాయంత్రం ఆ విషయాన్ని ఓ స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. అప్పటికీ తల్లి కదల్లేని పరిస్థితుల్లో ఉండి రోదిస్తోంది. అయితే, చనిపోయిన భరత్‌కు అంత్యక్రియలు నిర్వహించేవారు ఎవరూ లేక పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
Also Read: కరోనాకు నాటు వైద్యం చేయిస్తామని బాలికతో వ్యభిచారం... 13 మందిని అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు
Also Read: డ్రగ్స్ కేసు భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్