Telangana Crime News: నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
Begum Bazar Crime News: ఆర్థిక కష్టాలతో నిన్న తాండూరులో ఓ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటే ఇవాళ బేగం బజార్‌లో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన దుర్ఘటన మరింత దారుణంగా ఉంది.

Telangana Crime News: తెలంగాణలో 24 గంటల వ్యవధిలో జరిగిన రెండు దారుణాలు కలకలం రేపాయి. తాండూరులో ఓ వ్యక్తి బేగంబజారులో మరో వ్యక్తి కుటుంబాన్ని దారుణంగా హతమార్చారు. కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సిన వ్యక్తులే ఇలా చంపడం తర్వాత ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చి బేగంబజారులో స్థిరపడిన సిరాజ్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని హతమార్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబాన్ని చంపుతున్నప్పుడు చూసిన పెద్ద కుమారుడు భయంతో తప్పించుకొని పారిపోయాడు. తెల్లవారుజామున కత్తితో సిరాజ్ తన భర్య కొంతు కోసి చంపేశాడు. తర్వాత చిన్న కుమారుడు గొంతు నులిమి హతమార్చాడు. ఈ రెండుహత్యలు చూసిన పెద్దకుమారుడు భయంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం సూసైడ్ నోట్ చేసిన సిరాజ్ తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
సూసైడ్ నోట్‌లో ఏముందో పోలీసులు చూస్తున్నారు. పెద్దకుమారుడిని విచారిస్తున్నారు. ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారా లేకుంటే వేరే సమస్యలు ఉన్నాయనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ దుర్ఘటన జరిగిన కాసేపటికి ఘటనాస్థలానికి పోలీసులు, క్లూస్ టీంలు చేరుకున్నాయి. ఆధారాలు సేకరిస్తున్నాయి.
ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో నష్టపోయి అప్పులు- కుటుంబమంతా సూసైడ్
24 గంటల క్రితం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటలో ఇలాంటి దారుణమే ఒకటి జరిగింది. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన వ్యక్తి కుటుంబాన్నే మృత్యువుకు బలి ఇచ్చాడు. కాసిపేటకు చెందిన శివప్రసాద్ సోషల్ మీడియాలో చూసి స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు. సరైన అవగాహన లేకపోవడంతో అప్పులు పాలు అయ్యాడు. దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులతో పురుగుల మందు తాగేశాడు.
పాతికేళ్ల శివప్రసాద్ తన తల్లిదండ్రులు, అక్కకు పురుగుల మందు తాగించాడు. అక్క దివ్యాంగురాలు. తాము పోయిన తర్వాత ఆమెను ఎవరు చూసుకుంటారని ఆమెకి కూడా పురుగుల మందు ఇచ్చాడు. వీళ్లంతా వరంగల్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గంటల వ్యవధిలోనే ఒక కుటుంబమంతా చనిపోవడం కాసిపేటలో తీవ్ర విషాదం నెలకొంది.
ఆన్‌లైన్‌లో విషం ఆర్డర్- వివాహిత సూసైడ్
కుటుంబ కలహాలతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటనాగలక్ష్మి ఆన్‌లైన్‌లో విషం తెప్పించుకొని సూసైడ్ చేసుకుంది. మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగలక్ష్మికి ఐదు నెలల క్రితమే ప్రకాశం జిల్లా ముసునూరు మండలం తోచిలుకకు చెందిన మనోజ్‌తో వివాహమైంది. ఆయన కాంట్రాక్టర్‌గా ఉన్నారు. దంపతుల మధ్య ఉన్న విభేదాలు కారణంగానే నాగలక్ష్మి సూసైడ్ చేసుకున్నట్టు ఫ్యామిలీ ఆరోపిస్తోంది. ముందుగానే నిర్ణయించుకున్న నాగలక్ష్మి విష పదార్థాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుందన్నారు.
బుధవారం రాత్రి విషం తాగిన సంగతి తెలుసుకున్న నాగలక్ష్మి కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 24 గంటల పాటు శ్రమించినా వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు. దీంతో మనోజ్ వేధింపులతోనే నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య- కలకలం రేపుతున్న సూసైడ్‌లు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

