అన్వేషించండి

Koneru Konappa: కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై, హస్తం పార్టీలో తిరిగి చేరేది లేదన్న కోనేరు కోనప్ప

Telangana Politics | కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గుడ్ బై చెప్పారు. జీవితంలో తిరిగి హస్తం పార్టీలో రేది లేదని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Koneru Konappa quits from Congress party | ఆసిఫాబాద్: సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన.. రాజకీయంగా తాను ఏ పార్టీలోకైనా వెళ్తాను కానీ, హస్తం పార్టీకి మాత్రం తిరిగి రానని చెప్పారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా గ్రామ సమీపంలో ఆదివారం ఏర్పాటు చేసిన కోనేరు ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. తనకు ఏ పార్టీ అండ అవసరం లేదని కార్యకర్తలు, ప్రజలే తన బలమని పేర్కొన్నారు. 

హామీలు అమలు కావడం లేదు, అభివద్ధి జరగడం లేదని ఆరోపణలు

ప్రస్తుతం పోడు రైతులు అటవీ అధికారుల ఒత్తిడికి గురవుతున్నారని, వారికి ఎళ్లప్పుడూ అండగా ఉంటానన్నారు. నియోజకవర్గంలో పర్యటించిన మంత్రులు పోడు రైతుల పట్ల స్పష్టమైన హామీ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలుమార్లు సిర్పూర్ అభివృద్ధి కోసం అభ్యర్థించినా స్పందించలేదన్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పోడు రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ దేవుడని, ఆయనకు పాదాభివందనాలని కాంగ్రెస్ పార్టీలో చేరిన నాడే తాను చెప్పానని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.


Koneru Konappa: కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై, హస్తం పార్టీలో తిరిగి చేరేది లేదన్న కోనేరు కోనప్ప

తనను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని పార్టీలో తీసుకునేటప్పుడు చెప్పలేదనే బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చానని అన్నారు. రాజకీయంగా బిఆర్ఎస్ పార్టీతోను, కేసీఆర్ కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. రాజకీయంగా ఏదైనా పార్టీలోకి పోవాల్సి వస్తే వెళ్తా.. కానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం అస్సలు వెళ్లనని తేల్చి చెప్పారు. అయితే ఇదివరకే ఆయన పార్టీని వీడే ప్రయత్నం చేయగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీతో పార్టికి దూరంగా ఉన్న అలాగే ఉండిపోయారు. 

పార్టీలోనూ కనిపించని ప్రాధాన్యత.. రూట్ మార్చిన మాజీ ఎమ్మెల్యే

నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేపట్టాలని కోరగా పనులేమి ముందుకూ సాగడం లేదు, పార్టీలోనూ సరెైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన తన నిర్ణయం మార్చుకున్నారు. ఆదివారం తన అనుచరులు, అభిమానులతో సమావేశమై ఈ కీలకమైన విషయాలను వెల్లడించారు. మొత్తానికి కోనప్ప రాజకీయంగా ఎదైనా పార్టీలోకి వెళతాను గానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం అస్సలు వెళ్ళనని తేటతెల్లం చేశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై అంటూ కోనేరు కోనప్ప తన ఆవేదనని మీడియా ముఖంగా చెప్పేశారు. త్వరలో కొనప్ప ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget