అన్వేషించండి

Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy to Visit Asifabad | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరమెరి మండలం కొఠారి గ్రామంలో పూర్తయిన ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సీఎం రేవంత్ రెడ్డి రూ.112 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
  • ఇందిరమ్మ ఇళ్ల పథకం గృహప్రవేశాలు, రెండో విడత ప్రారంభోత్సవం ఉంటుంది.
  • 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు, పట్టణ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
  • సీఎం పర్యటన కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు, భారీ పోలీసు బందోబస్తు.

ఆసిఫాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో చేపట్టనున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మొత్తం రూ.112.14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చింతలమానేపల్లి మండలంలోని కౌటాల (రవీంద్రనగర్ క్యాంపు నం-2) గ్రామంలో ఏర్పాటు చేయనున్న 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.56.55 కోట్లు. రెబ్బెన మండలం నాంబాల్ గ్రామంలో రూ.6 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ ప్లాంట్ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

నారాయణపేటలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలివిడతలో ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సాయంతో 3,68,540 ఇళ్లు కేటాయించగా, 1,09,682 ఇళ్లు పూర్తయ్యాయి. వీటి గృహప్రవేశాలు, రెండో విడత ఇళ్ల ప్రకటన కోసం రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం 5:45 గంటలకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలోని గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. అనంతరం కాగజ్‌నగర్ సభ నుండి రెండో విడత గృహ నిర్మాణ ప్రక్రియను ఆయన అధికారికంగా ప్రారంభిస్తారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసం నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి హైదరాబాద్ కు రానున్నారు. 

అదే విధంగా చింతలమానేపల్లి, గుడ్లబోరి, కాపువాడ, చింతకుంట, అంకుషాపూర్ ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల పనులకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఉపకేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత బలోపేతం కావడంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రానుంది. 

Also Read: KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్

జిల్లాలోని ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో చేపట్టనున్న తొమ్మిది అభివృద్ధి పనులు, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో రూ.18.70 కోట్లతో చేపట్టనున్న ఎనిమిది అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ, పునరుత్పాదక ఇంధన వినియోగ ప్రోత్సాహం, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి జూపల్లి  తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా  ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు.

సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు – జిల్లా ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు సభా స్థలం, పార్కింగ్ ప్రదేశాలు, వీఐపీ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, హెలిప్యాడ్ ప్రాంతం, ట్రాఫిక్ మార్గాలు తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా భద్రతా నిర్వహణ కోసం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బందోబస్తులో ఇద్దరు అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు/ఆర్‌ఐలు, 157 మంది ఎస్‌ఐలు/ ఆర్‌ఎస్‌ఐలు/ డబ్ల్యూఎస్‌ఐలు, 200 మంది ఏఎస్‌ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు, 829 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 43 మంది మహిళా పోలీసు సిబ్బంది, 328 మంది హోంగార్డులు విధుల్లో పాల్గొనున్నారు. 

Also Read: Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు

అదనంగా 9 ప్రత్యేక పార్టీలు, 2 రోప్ పార్టీలు, 28 యాక్సెస్ కంట్రోల్ బృందాలు, 10 బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలను మోహరించినట్లు తెలిపారు. మొత్తం 1,825 మంది పోలీసు అధికారులు, సిబ్బంది సీఎం రేవంత్ రెడ్డి పర్యటన భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి, ట్రాఫిక్, భద్రతా నియమాలను పాటించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ విజ్ఞప్తి చేశారు.

Frequently Asked Questions

తెలంగాణ ముఖ్యమంత్రి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారా?

అవును, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ముఖ్యమంత్రి ఎన్ని కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు?

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మొత్తం రూ.112.14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో విద్యుత్ ఉపకేంద్రాలు, సౌర విద్యుత్ ప్లాంట్లు, పట్టణాభివృద్ధి పనులు ఉన్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ఏమి ప్రకటించనున్నారు?

ముఖ్యమంత్రి రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. కొఠారి గ్రామంలో గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు?

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 1,825 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రత్యేక బృందాలు భద్రతా నిర్వహణలో పాల్గొంటున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget