అన్వేషించండి

Indiramma Housing Scheme: అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, మే నెలాఖరుకు అర్హుల జాబితా: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.
  • 3,500 ఇళ్ల మంజూరుతో పాటు 1.20 లక్షల ఇళ్లకు ఏప్రిల్ నాటికి అనుమతి లభించింది.
  • కేంద్రం నిధులు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణ భారాన్ని భరిస్తుంది.
  • పాత కాలనీల్లో శిథిల ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నారు.

Ponguleti Srinivas Reddy | ఆసిఫాబాద్: తెలంగాణలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నెలాఖరు వరకు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్న క్రమంలో ఏర్పాటు చేయనున్న సభాస్థలి, రెబ్బెన మండలం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్, కాగజ్ నగర్ మండలం దాదానగర్, కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్ క్రీడా ప్రాంగణాన్ని బుధవారం రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కె.హరిత, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్, అధికారులతో కలిసి పరిశీలించారు.


Indiramma Housing Scheme: అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, మే నెలాఖరుకు అర్హుల జాబితా: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లాలో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంచనంగా ప్రారంభించనున్నారని తెలిపారు. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3 వేల 500 ఇండ్లు మంజూరు చేస్తున్నామని, ఏప్రిల్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష 20 వేల ఇండ్లు మంజూరయ్యాయని, జూన్ నాటికి 2 లక్షల 35 వేల ఇండ్లు పూర్తవుతాయని తెలిపారు.

Also Read: Bandi Sanjay: ఎక్కడైనా కొడుకును తండ్రి పోలీసులకు అప్పగిస్తాడా? ఫాల్తుగాళ్లు నాపై దుష్ప్రచారం చేపిస్తున్నారు: బండి సంజయ్

గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలలో ఆర్భాటాలకే పరిమితమయ్యారని, ప్రజా ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు 4 లక్షల ఇల్లు 22 వేల 700 కోట్ల రూపాయలతో శ్రీకారం చుట్టి అర్హులైన ఇంటి నిర్మాణ స్థాయికి అనుగుణంగా దశలవారీగా రూ. 5 లక్షలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి, రెండవ విడతలలో మాత్రమే కాకుండా అర్హత గల  పేదవారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యేలా కృషి చేస్తాం అన్నారు. ఆదివాసి జిల్లా కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ లో జూన్ 2వ తేదీన జరగనున్నముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, జూపల్లి కృష్ణారావు సంబంధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Indiramma Housing Scheme: అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, మే నెలాఖరుకు అర్హుల జాబితా: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Also Read: Telangana News: జూన్ 2న ఆసిఫాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఇందిరమ్మ ఇండ్ల పండుగకు శ్రీకారం

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్రం నుండి ఒక్కో ఇంటికి రావాల్సిన రూ.1.13 లక్షల వాటా నిధుల కోసం మార్చి నుండి ఎదురుచూస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. కేంద్ర నిధుల నమ్మకంతోనే లబ్ధిదారుల ఫైనల్ బిల్లులో కొంత మొత్తం ఆపామన్నారు. మరో 15 రోజుల్లో కేంద్రం నిధులు విడుదల చేయకపోతే, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించి లబ్ధిదారులకు అందజేస్తుందని భరోసా ఇచ్చారు.

మొదటి విడత కింద మంజూరైన 3.5 లక్షల ఇండ్లలో 1.32 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, జూన్ నెలాఖరుకల్లా మరో 68-72 వేల ఇండ్ల శ్లాబ్ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. 40- 50 ఏళ్ల క్రితం పాత కాలనీల్లోని శిథిలావస్థ ఇండ్ల స్థానంలో కొత్త ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, నిర్మాణానికి అవసరమైన ఇసుక, మట్టిని ఉచితంగా అందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

Frequently Asked Questions

ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం ఏమిటి?

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించడం ఈ పథకం లక్ష్యం. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు మంజూరు చేయబడ్డాయి మరియు ఎన్ని పూర్తయ్యాయి?

ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. ఏప్రిల్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,20,000 ఇళ్లు మంజూరయ్యాయి, జూన్ నాటికి 2,35,000 ఇళ్లు పూర్తవుతాయి.

ఇళ్ల నిర్మాణానికి ఎంత మొత్తం కేటాయించబడింది మరియు లబ్ధిదారులకు ఎలా జమ అవుతుంది?

4,00,000 ఇళ్ల నిర్మాణానికి 22,700 కోట్ల రూపాయలు కేటాయించారు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో దశలవారీగా 5 లక్షల రూపాయలు జమ చేయబడతాయి.

కేంద్ర ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంత వాటా రావాల్సి ఉంది?

కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి ఇంటికి రూ. 1.13 లక్షల వాటా నిధుల కోసం మార్చి నుండి ఎదురుచూస్తున్నారు. ఈ నిధులు రాకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Kavitha Warns KTR: కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓటమి.. నాతో పెట్టుకోకంటూ కవిత డైరెక్ట్ వార్నింగ్
కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓటమి.. నాతో పెట్టుకోకంటూ కవిత డైరెక్ట్ వార్నింగ్
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
KTR Passport Seized: ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !
ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Bowling Coach Reunion: చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Embed widget