అన్వేషించండి

Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు

Balka Suman Arrested | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌‌ను మేజిస్ట్రేట్ చందన ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు బాల్క సుమన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అరెస్ట్ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలింపు.

హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. హిమాయత్ నగర్‌లోని నాంపల్లి మేజిస్ట్రేట్ చందన ఎదుట హాజరుపరచగా.. కేసు వివరాలు పరిశీలించిన అనంతరం రెండు వారాల పాటు రిమాండ్ విధించారు. తరువాత నాంపల్లి పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఈ సందర్భంగా పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. FIR కాపీ మరిచిపోయి రావడంతో పాటు అపార్ట్మెంట్ లోని జడ్జి ఫ్లాట్ కు  నిందితుడు బాల్క సుమన్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేసిన పోలీసులపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ కిందనే వేచిఉండాలని జడ్జి సూచించడంతో, బాల్క సుమన్ తరఫు లాయర్లు అక్కడే వేచి చూశారు. అంతకుముందు ఆరు గంటలకు పైగా విచారించిన తర్వాత నాంపల్లి పోలీసులు బాల్క సుమన్‌ను కింగ్ కోఠిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్..

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ, తెలంగాణ భవన్ కేంద్రంగా భారీ హైడ్రామా మధ్య ఈ అరెస్టు ప్రక్రియ కొనసాగింది. సింగరేణి సంస్థకు సంబంధించి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో, పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌ లోపల ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు, లాయర్లు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని బీఆర్‌ఎస్‌ లీగల్ సెల్ ప్రతినిధులు ప్రశ్నించగా, ఇవి నాన్‌బెయిలబుల్ కేసులు కావడంతో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు. శనివారం నాంపల్లి పోలీసులు తెలంగాణ భవన్‌కు చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 

Also Read: Balka Suman Arrested: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు

ఈ వివాదానికి ప్రధాన కారణం సింగరేణి బొగ్గు గని కార్మికుల సమావేశంలో బాల్క సుమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలేనని పోలీసులు తెలిపారు. "సింగరేణిని తగులబెట్టండి... మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి.. డబ్బులు కావాలంటే ఆఫీస్‌లను తగలబెట్టాలి" అంటూ ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆనంద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఫిర్యాదుతో బాల్క సుమన్‌పై 326(g), 351(3), 353(1)(b), r/w 61(2)(a) బీఎన్ఎస్ (BNS), పీడీపీపీఏ (PDPPA) వంటి అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

భారీగా మోహరించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ శ్రేణుల నినాదాలు
బాల్క సుమన్ చేసిన మిలిటెంట్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన అరెస్టు ఖాయమని ముందే ప్రచారం జరగడంతో, ఆయన గత 3 రోజులుగా తెలంగాణ భవన్‌నే తన ఆవాసంగా మార్చుకున్నారు. ఆయన బయటకు రాగానే అరెస్టు చేయాలని పోలీసులు వ్యూహం రచించి, భవన్ వెలుపల భారీగా మోహరించారు. "పోలీస్ గో బ్యాక్" అంటూ కార్యకర్తలు చేసిన భారీ నినాదాలతో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతమంతా హోరెత్తింది. 

బాల్క సుమన్ అరెస్ట్ అన్యాయం: బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ 
బాల్క సుమన్ అరెస్టును ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. పార్టీ అంతర్గత సమావేశంలో జరిగిన వాడివేడి చర్చల ఆధారంగా బాల్క సుమన్‌ను అరెస్ట్ చేయడం పూర్తిగా అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ఆ సమావేశంలో మాట్లాడిన మాటల వల్ల తెలంగాణలో ఎక్కడా ఎలాంటి హింస జరగలేదని, పైగా బాల్క సుమన్ కానీ, పార్టీ అధికార ప్రతినిధి కానీ ఆ వ్యాఖ్యలను బయటకు వచ్చి పార్టీ నిర్ణయంగా ఎక్కడా ప్రకటించలేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఆ మాటలను నేరంగా ఎలా పరిగణిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

Also Read: Balka Suman controversy: మిలిటెంట్ దాడులు చేద్దాం, ఆఫీసుల్ని తగులబెడదాం - బీఆర్ఎస్ కార్యకర్తలకు బాల్క సుమన్ పిలుపు వివాదాస్పదం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, ఎమ్మెల్యే శంకర్, బండి సంజయ్ వంటి నాయకులు మాట్లాడుతున్న విద్వేషపు మాటల వల్ల తెలంగాణలో ఇప్పటికే ఒక తరం నాశనమైందని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. సంగారెడ్డిలో పోలీసులను తీవ్ర పదజాలంతో దూషించిన టీపీసీసీ నేత జగ్గారెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వకపోతే జగ్గారెడ్డిపై కేసు కూడా పెట్టేవాళ్లు కాదన్నారు. జగ్గారెడ్డిపై నమోదైన కేసు ప్రస్తుతం అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉందా, చార్జిషీట్ దాఖలు చేశారా లేదా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ (MF) కింద క్లోజ్ చేశారా అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు.

Frequently Asked Questions

బాల్క సుమన్‌కు ఎన్ని రోజుల రిమాండ్ విధించారు?

బాల్క సుమన్‌కు రోజుల రిమాండ్ విధించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని కింగ్ కోఠిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget