అన్వేషించండి

KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్

KTR Challenges Revanth Reddy 420 Promises | రైతుల బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించడం కాదు, ఎన్నికల హామీలు నెరవేర్చాకే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఛాలెంజ్ చేయాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, ఎన్నికల హామీలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
  • రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ను కాంగ్రెస్ రద్దు చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు.
  • హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని, ఇళ్లు కూల్చివేస్తోందని విమర్శించారు.
  • బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసి, కాంగ్రెస్ పై పోరాడాలని సూచించారు.

Free Power To Farmers | హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఛాలెంజ్ చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో ఆదివారం జరిగిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

3 గంటల కరెంట్ చాలన్న వ్యక్తి రేవంత్ రెడ్డి..
రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయనంటూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు ముమ్మాటికి అబద్ధాలన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 24 గంటల ఉచిత కరెంట్‌ను పూర్తిగా ఎగగొట్టేందుకే రైతు డిస్కం పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, రేవంత్ రెడ్డికి రైతులపై అంతే ప్రేమ ఉందంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. 

ఉచిత విద్యుత్‌ను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్..
'రైతు డిస్కం' అనేది రైతన్నల మెడకు ఉరితాడు లాంటిదని, దీని ద్వారా ఉచిత విద్యుత్‌ను శాశ్వతంగా రద్దు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, పారిశ్రామిక సెలవులతో (ఇండస్ట్రియల్ హాలిడేస్) రాష్ట్రం అతలాకుతలం అయిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోనే ఆ దుస్థితిని మార్చి, 79 ఏళ్ల భారత చరిత్రలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఏకైక నేతగా నిలిచారన్నారు. కేసీఆర్ గుర్తులు చెరిపేస్తానంటున్న రేవంత్ రెడ్డి, చివరికి రైతన్నల నోటికాడి కూడును లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ రైతు వ్యతిరేక కుట్రలపై ప్రజలు కూడా స్పందించి రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
Also Read: Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులుKTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్

హైడ్రా భూతంతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు: కేటీఆర్ ఆగ్రహం
 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేటీఆర్ విమర్శించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వారు వచ్చి 6 వేల ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరంలో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, 20 వేల లీటర్ల ఉచిత తాగునీరు అందించడంతో పాటు జీవో 58, 59 ద్వారా పేదలకు భూమి హక్కులు కల్పించామని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా (HYDRAA) అనే భూతాన్ని తెచ్చి పేద ప్రజల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొడుతోందని, వారికి తీరని అన్యాయాన్ని చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!

కంటోన్మెంట్‌లో డిఫెన్స్ భూముల బదలాయింపు కోసం, కరీంనగర్, నిజామాబాద్ వైపు స్కైవేల నిర్మాణం కోసం నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి వల్లే నేడు ఆ పనులు సాకారమయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే ఆర్మీ అధికారులు అడ్డగోలుగా రోడ్లు మూసివేస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించింది తామేనన్నారు. దేశమంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని తిరస్కరిస్తే, తెలంగాణలో మాత్రం అది మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికలు లేకపోయినప్పటికీ, కార్యకర్తలంతా కలిసికట్టుగా ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

 

Frequently Asked Questions

రైతు డిస్కం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కుట్ర చేస్తోంది?

రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో 3 గంటల కరెంట్ సరిపోతుందని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఎగగొట్టేందుకే ఈ ప్రణాళిక అంటున్నారు.

తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఎవరు అందించారు?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలుండేవని, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించారని కేటీఆర్ గుర్తు చేశారు.

హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా హైదరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేటీఆర్ విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఫ్లై ఓవర్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, 20 వేల లీటర్ల ఉచిత తాగునీరు అందించామని గుర్తు చేశారు.

హైదరాబాద్‌లో పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది?

కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా (HYDRAA) అనే భూతాన్ని తెచ్చి పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొడుతోందని, వారికి తీరని అన్యాయం చేస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget