News
News
X

Nizamabad news: నిజామాబాద్ జిల్లాపై బీఎస్పీ ఫోకస్‌ - నాలుగు సీట్లలో పాగా వేసేలా స్కెచ్‌

నిజామాబాద్ జిల్లాపై బీఎస్పీ పోకస్, 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు స్కెచ్. జిల్లాలో బహుజనుల సంఖ్యపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరా...

FOLLOW US: 

తెలంగాణ రాజకీయాల్లో బీఎస్పీ తనదైన శైలిలో ముద్ర వేసుకునేందుకు పాలవులు కదుపుతోంది. బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంట్రీతో ఆ పార్టీలో జోష్ నింపారు. బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ పదవి చేపట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. బీఎస్పీకి ఏ ఏ జిల్లాలో ఏఏ నియోజకవర్గాల్లో ఆదరణ ఉందో అన్నదానిపై లెక్కలు వేసుకున్నారాయన. దీంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాపై ఆయన ఇప్పుడు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, బోధన్, జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి నియోజక వర్గాల నుంచి బహుజన సమాజ్ వాది పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా బరిలో నిలిచారు. అయితే బాల్కొండలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన సునీల్ రెడ్డి అనూహ్యంగా రెండో స్థానంలో నిలిచారు. మిగతా చోట్ల అంతగా ప్రభావం చూపకపోయిన పోటీ ఉన్నామని సంకేతాలిచ్చారు.

బహుజన్ సమాజ్ వాది పార్టీకి ఎక్కువగా అనుకూలంగా ఉన్న బాల్కొండ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాలపై ఎక్కువగా ఆ పార్టీ అధిష్ఠానం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు త్రిముఖ పోటీ ఉంటుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నప్పటికీ సిట్టింగ్ లో ఎవరికైనా ఒకవేళ టికెట్ దక్కకుంటే ప్రత్యామ్నయం చూసుకునే అవకాశమూ లేకపోలేదు. చివరి క్షణంలో అలాంటి అభ్యర్థులు బీఎస్పీని ఆశ్రయించే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయ్. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ లో కూడా టికెట్ ఆశిస్తున్న వారు చివరికి ఆశాభంగం కలిగితే వారు సైతం బీఎస్పీ వైపు చూసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన సెకండ్ క్యాడర్ లీడర్లు సైతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అన్ని పార్టీల నుంచి ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన వారే పోటీలో ముందుంటున్నారు. బహుజనులకు అవకాశం ఇచ్చేందుకు బీఎస్పీ ముందుకు వస్తోంది. బాల్కొండ నియోజకవర్గంలో గతంలో ఉన్నత వర్గానికే చెందిన సునీల్ రెడ్డి బీఎస్పీ నుంచే పోటీ చేశారు. ఓట్లు కూడా బాగానే వచ్చాయ్. అయితే ఈ సారి బాల్కొండలో ఉన్నత వర్గానికి చెందిన  నేతకు కాకుండా బహుజనలకు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సెకండ్ ఆప్షన్ పెట్టుకున్న వివిధ పార్టీలకు చెందిన ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన నేతలు అయోమయంలో పడ్డారు. 

అయితే జుక్కలో నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావటంతో దీనిపై బీఎస్పీ ప్రధానంగా పోకస్ పెట్టింది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉంటారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సపోర్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే జుక్కల్ సీటు కైవసం చేసుకునేందుకు ప్రవీణ్ కుమార్ పావులు కదుపుతున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీఎస్పీ రెండో స్థానంలో నిలిచింది. అయితే అభ్యర్థిని బట్టి కూడా ఇక్కడ ఓట్లు పోల్ అయ్యాయి. పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి ఈసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నియోజకవర్గంపైనా ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. ప్రజామోదయోగ్యమైన అభ్యర్థిని బరిలో ఉంచేందుకు బీఎస్పీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు కామారెడ్డి, ఇటు ఎల్లారెడ్డి, ఇటు నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల నుంచి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. 

News Reels

జిల్లాలో ప్రవీణ్ కుమార్ పర్యటనలు చేసినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో అతనికి వచ్చిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఏ ఏ నియోజకవర్గంలో ఎలాంటి అభ్యర్థులను బరిలో ఉంచాలన్న దానిపై స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఉన్నత సామాజిక వర్గాల కంటే జనాభా బహుజనులదే ఎ్కకువగా ఉంటుంది. ఈ నేపధ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 

Published at : 30 Sep 2022 01:09 PM (IST) Tags: Nizamabad Latest News Nizamabad Updates Nizamabad News NIzamabad

సంబంధిత కథనాలు

YS Sharmila Effigy Burnt: షర్మిల దిష్టిబొమ్మ దహనం, మారకపోతే మరింత బుద్ధి చెబుతామన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

YS Sharmila Effigy Burnt: షర్మిల దిష్టిబొమ్మ దహనం, మారకపోతే మరింత బుద్ధి చెబుతామన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Nizamabad News: జనవరి 10 కల్లా అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు

Nizamabad News: జనవరి 10 కల్లా అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

Gold-Silver Price 30 November 2022: బంగారం కొనాలంటే మాత్రం ఆలస్యం చేయకండి- ఈ నగరంలో కొంటే మరింత తగ్గనున్న రేట్‌!

Gold-Silver Price 30 November 2022: బంగారం కొనాలంటే మాత్రం ఆలస్యం చేయకండి- ఈ నగరంలో కొంటే మరింత తగ్గనున్న రేట్‌!

టాప్ స్టోరీస్

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

TRS Fire On Sharimila :  భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?