అన్వేషించండి

Nizamabad News: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 2 గంటల ముందే చేరుకోవాలి. అవకతవకలకు తావులేకుండా చర్యలు. 16వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు నుంచి ఒంటిగంట వరకు పరీక్ష

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్ల గురించి, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనల గురించి కలెక్టర్ వివరించారు. 16 వ తేదీన ఉదయం 10 . 30 గంటల నుంచి మధ్యాన్నం 1.00 గంట వరకు కొనసాగే పరీక్షకు జిల్లాలో 12,858 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. వీరి కోసం జిల్లాలో 40 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 
 
టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ ద్వారా ఇప్పటికే 70 శాతం మంది హాల్ టికెట్‌లు డౌన్‌లోడ్ చేసుకున్నారని, మిగతా వారు కూడా డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు జిల్లా కలెక్టర్. హాల్ టికెట్‌లో ఎవరికైనా ఫోటో ప్రింట్ కాని పక్షంలో మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తెల్ల కాగితంపై అతికించి గజిటెడ్ అధికారి అటెస్టేషన్‌తో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు తమవెంట తప్పనిసరిగా ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐ.డీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తేవాలని సూచించారు. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలన్నారు. సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఎగ్జామ్ ప్యాడ్‌కు అనుమతి లేనందున వాటిని వెంట తెచ్చుకోకూడదని అన్నారు.
 
ఈసారి ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఎలక్రానిక్ పరికరాల గుర్తింపు కోసం ప్రత్యేకంగా మెటల్ డిటెక్టర్‌లు ఏర్పాటు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. వీలైనంత వరకు చెప్పులు ధరించి రావాలని, బయోమెట్రిక్ విధానం ఉన్నందున చేతులకు గోరింటాకు, ఇతరాత్రా పెయింట్ లు ఉండకుండా చూసుకోవాలని హితవు పలికారు. జిల్లాకు సంబంధించి 24 మంది దివ్యాంగులైన అభ్యర్థులు తమకు బదులుగా ఇతరులతో పరీక్ష రాసేందుకు అనుమతి కోరారని, అలాంటివారు ఇంటర్మీడియట్ కంటే తక్కువ విద్యార్హత కలిగిన వారితోనే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. తమ వెంట వైకల్యం ధృవీకరించే సర్టిఫికెట్ తేవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 
 
ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే, జిల్లా స్థాయిలో నెలకొల్పిన కంట్రోల్ రూమ్ 08462 - 220183 నెంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని, అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కాల్ సెంటర్ 040 - 22445566 నెంబర్‌కు కూడా నేరుగా ఫోన్ చేయవచ్చని అన్నారు. హాల్ టికెట్‌లో పొందుపర్చిన పరీక్షా కేంద్రాన్ని అభ్యర్థులు ముందుగానే వెళ్లి పరిశీలించుకుంటే పరీక్ష రోజున గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉండదని కలెక్టర్ హితవు పలికారు.
 
ఈసారి ప్రిలిమ్స్ పరీక్షకు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ తప్పనిసరి చేసినందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి కనీసం రెండు గంటలు ముందే కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి 60 మందికి ఒక బయో మెట్రిక్ యూనిట్ అందుబాటులో ఉంటుందన్నారు. ఉదయం 10 .15 గంటల వరకే పరీక్షా కేంద్రంలోనికి వెళ్లేందుకు అనుమతిస్తారని అనంతరం గేట్లు మూసివేస్తారని స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల నుంచే వచ్చే అభ్యర్థులంతా ఉదయం 8 .00 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 
 
అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కలెక్టర్. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ డ్యూయల్ డెస్క్ టేబుళ్లు, తగినంత వెలుతురు, సరిపడా లైటింగ్, తాగునీరు, టాయిలెట్ వసతులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ప్రతి కేంద్రంలో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ నియమిస్తున్నామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్‌లు మూసి ఉంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
 
అన్ని కేంద్రాల వద్ద మహిళా పోలీసు సిబ్బంది సైతం ఉంటారని, అభ్యర్థుల కోసం బస్టాండ్లలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమిస్తూ వారికి పరీక్షల నిర్వహణ, నిబంధనలపై శిక్షణ ఇచ్చామని వివరించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన అన్ని పరీక్షా కేంద్రాల్లోని ప్రతి గదిలోనూ సి.సి కెమెరాలు ఉండగా, ప్రభుత్వ విద్యా సంస్థల్లోని కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ జరిపిస్తామన్నారు.
 
ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్, 7 కేంద్రాలకు ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అపశ్రుతులు, అపవాదులకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అభ్యర్థులు నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Kumuram Bheem Asifabad Latest News: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో SIR ప్రారంభం- ముందు తమది ఏ రాష్ట్రమో తేల్చాలని ప్రజల డిమాండ్ 
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో SIR ప్రారంభం- ముందు తమది ఏ రాష్ట్రమో తేల్చాలని ప్రజల డిమాండ్ 
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget