అన్వేషించండి

Crime News: నిత్య పెళ్లికొడుకుగా మారిన కానిస్టేబుల్‌పై పోక్సో కేసు, బాలికతో పెళ్లిపై చర్యలు

Suryapet News | నిత్య పెళ్లికొడుకు మారిన కానిస్టేబుల్‌ మైనర్ బాలికను సైతం పెళ్లి చేసుకోవడంతో చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదు అయింది.

POCSO Case against Constable | సూర్యాపేట: ఓ పోలీస్ కానిస్టేబుల్ నిత్య పెళ్లి కొడుకుగా మారడం సూర్యాపేట జిల్లాలో హాట్ టాపిక్ అయింది. అవకాశం దొరికితే చాలు పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. ఓ మైనర్ బాలికను సైతం కానిస్టేబుల్ వివాహం చేసుకోవడంతో అతడి కథ అడ్డం తిరిగింది. ఉన్నతాధికారుల దృష్టికి విషయం వెళ్లడంతో కానిస్టేబుల్ పై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. నడిగూడెం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ కృష్ణంరాజు ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని తేలింది. నిత్య పెళ్లికొడుకు  కృష్ణంరాజుపై సూర్యాపేట రూరల్ పోలీసులు శనివారం నాడు పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు. 

నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న కానిస్టేబుల్..
ఏడాది కిందట సూర్యాపేట మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను కానిస్టేబుల్ కృష్ణంరాజు మూడవ వివాహం చేసుకున్నాడు. ఈ విషయం ఇటీవల సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ చేయడంతో బాగా వైరల్ అయింది. ఆ బాలిక ప్రస్తుతం సూర్యాపేట టౌన్‌లో నివసిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బాలికతో పెళ్లిపై, వరుస పెళ్లిళ్ల విషయంపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం జరగడం, సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ దృష్టికి రావడంతో ఆయన కృష్ణంరాజుపై విచారణకు ఆదేశించారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. ఆయన బాలిక నివాసానికి వెళ్లి వివరాలు సేకరించారు. బాలిక తల్లి సైతం ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన అనంతరం సస్పెండ్ అయిన కానిస్టేబుల్ కృష్ణంరాజుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట రూరల్ ఎస్సై బాలునాయక్‌ తెలిపారు.

డిప్యూటేషన్‌పై కలెక్టరేట్‌లో విధులు
కానిస్టేబుల్ కృష్ణంరాజుపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇసుక వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్‌ చేశారు. అనంతరం ఆయనను నడిగూడెం స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం అతడు సూర్యాపేట కలెక్టరేట్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నాడు. మైనర్ బాలికను వివాహం చేసుకోవడం నిబంధనలకు విరుద్ధమని, దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తారని భయపడి పది రోజుల కింద పరారయ్యాడు. ఈ క్రమంలో మైనర్‌ను వివాహం చేసుకున్న కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ పోక్సో కేసు నమోదు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Embed widget