Miyapur Crime News: మియాపూర్‌లో చిన్నారిని చంపేసి కుటుంబం ఆత్మహత్య- మృతులంతా కర్ణాటక వాసులుగా గుర్తింపు
Miyapur Crime News: ఓ కర్ణాటకు చెందిన ఫ్యామిలీ మియాపూర్‌లో ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఈ దుర్ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Miyapur Crime News: హైదరాబాద్‌లో మియాపూర్‌లో ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబంలోని చిన్నారిని ముందుగా చంపేసిన తర్వాత వారంతా సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి బలవన్మరణాలకు కారణాలపై విచారణ చేపట్టారు.
కర్ణాటకు చెందిన లక్ష్మయ్య, వెంకటమ్మ, వారి కుమార్తె కవిత, అల్లుడు అనిల్, మనవరాలు అప్పు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. ఆరేళ్లుగా ఇక్కడ ఉంటున్న వాళ్లు సడెన్‌గా ఎందుకు సూసైడ్ చేసుకున్నారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. చాలా సమయం తలుపుల తీయకపోగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసిన తర్వాత కుటుంబ సభ్యులంతా చనిపోయినట్టు గుర్తించారు.
ముందు చిన్నారి ప్రాణాలు తీసిన తర్వాత మిగతా కుటుంబ సభ్యులు విషం తీసుకొని చనిపోయినట్టు అక్కడ లభించిన ఆధారాలను బట్టి పోలీసులు చెబుతున్నారు. ఇంకా దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పూర్తి వివరాలు తెలిసిన తర్వాత అధికారికంగా సమాచారం అందజేస్తామంటున్నారు.
ముందు వీటిని అనుమాస్పద హత్యలుగా పోలీసులు భావించారు. కేసు దర్యాప్తు అలానే ప్రారంభించారు. కానీ ఇంట్లో లభించిన ఆధారాలను బట్టి సూసైడ్‌గా నిర్దారించారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. బంధువులకు సమాచారాన్ని చేరవేశారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.





















