Khammam Crime: ఆసుపత్రులే అతని టార్గెట్.. డాక్టర్ అవతారమెత్తి చోరీలు, పేషెంట్ల కార్లు క్షణాల్లో మాయం!
ఓ వ్యక్తి ఖమ్మం నగరానికి వచ్చి డబ్బు సంపాదనే ద్యేయంగా డాక్టర్ అవతారమెత్తిన ఆ దొంగ ఆసుపత్రులే టార్గెట్‌గా ఖరీదైన కార్లు, ఆసుపత్రులలో విలువైన వస్తువులకు చోరీలకు పాల్పడుతున్నాడు.
జల్సాలకు అలవాటుపడి అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే యువకులు కొందరు అనేక అవతారాలు ఎత్తుతున్నారు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఖమ్మం నగరానికి వచ్చి డబ్బు సంపాదనే ద్యేయంగా డాక్టర్ అవతారమెత్తిన ఆ దొంగ ఆసుపత్రులే టార్గెట్‌గా ఖరీదైన కార్లు, ఆసుపత్రులలో విలువైన వస్తువులకు చోరీలకు పాల్పడుతున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఆసుపత్రుల వద్ద ఉంచుతున్న ఖరీదైన కార్లు మాయం కావడంతో ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులకు అతడు అడ్డంగా దొరికిపోయాడు. ఇందుకు సంబందించి ఖమ్మం టూ సీఐ శ్రీదర్ ఆ వివరాలు వెల్లడించారు.
కృష్ణా జిల్లా నుంచి ఖమ్మం వలస వచ్చి..
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెనుములూరు మండలం పారంకి గ్రామానికి చెందిన దెందులూరు గణేష్ జల్సాలకు అలవాటుపడ్డాడు. తండ్రి చనిపోవడంతో ఖమ్మంలో బంధువులు ఉండటంతో ఉపాధి కోసం ఖమ్మం వచ్చాడు. నగరంలోని మామిళ్లగూడెంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని గత ఆరునెలలుగా ఇక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధి కోసం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంగ్‌గా చేరాడు. అయితే అప్పటికే గణేష్ జల్సాలకు అలవాటు పడటంతో డబ్బుల కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే అప్పటికే ఆసుపత్రిలో పనిచేస్తున్న గణేష్ అక్కడే దొంగతనాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువుల వద్ద ఉన్న డబ్బులు, ఇతర సామాగ్రి దొంగతనాలు చేసేవాడు.
డాక్టర్ అవతారమెత్తి..
ఇలా చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడితే ఎక్కువ డబ్బులు రాకపోతుండటంతో ఎలాగైన పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఆశతో చివరకు డాక్టర్ వేషం వేశాడు. డాక్టర్ లాగ వైట్ కోటు వేసుకుని, మెడలో స్టెతస్కోస్ ధరించి ఎవరికి అనుమానం రాకుండా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇటీవల తాను పనిచేసే ఆసుపత్రిలో ఓ వైద్యుడు తన కారు తాళం చేవి టేబుల్‌పై పెట్టడంతో ఎవరికి తెలియకుండా తాళం తీసుకున్న గణేష్ ఆ కారును దొంగలించాడు. ఇదే విధంగా మరో ఆసుపత్రికి డాక్టర్ వేషంలో వెళ్లిన గణేష్ అక్కడ రోగులను పరిశీలిస్తున్నట్లు నటించి సెల్‌ఫోన్లు దొంగతనం చేశాడు.
చివరకు పోలీసుల వలలో..
తాను దొంగలించిన కార్లు, సెల్‌ఫోన్లు, ఆసుపత్రులలో వినియోగించే ప్రింటర్లను అమ్మేందుకు గణేష్ విజయవాడ బయలుదేరాడు. అయితే కారు చోరి విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో కారులో వెళుతున్న గణేష్‌ను పోలీసులు అనుమానంతో విచారించగా అసలు దొంగతనాలు బయటపడ్డాయి. ఈ చోరీ సంఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ.10 లక్షల విలువ చేసే చోరీ సొత్తును స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు వాటి వివరాలను టూటౌన్ సీఐ శ్రీధర్ వాటి వివరాలను మీడియాకు వెల్లడించారు.
Also Read: Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత
Also Read: Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..
Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్ కంపెనీకి నష్టాల సెగ!!