News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..

సాధారణంగా బంగారం వెండి లేదా ప్లాటినం ధరల్లో రోజూ ఏ రెండు ధరల్లోనైనా మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ, నేడు మాత్రం మూడింటి ధరలు రాష్ట్ర మార్కెట్‌లోనే కాక, దేశీయ మార్కెట్‌లోనూ నిలకడగా ఉన్నాయి.

FOLLOW US: 
Share:

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు రెండూ నేడు స్థిరంగా ఉన్నాయి. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,990 గానే కొనసాగుతోంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,090 గానే ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర కూడా హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.65,500గా కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. సాధారణంగా బంగారం లేదా వెండి లేదా ప్లాటినం ధరల్లో రోజూ ఏ రెండు ధరల్లోనైనా మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ, నేడు (జనవరి 18) మాత్రం మూడింటి ధరలు రాష్ట్ర మార్కెట్‌లోనే కాక, దేశీయ మార్కెట్‌లోనూ నిలకడగా ఉన్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,990 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,090గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,500 గానే కొనసాగుతోంది. విజయవాడలోనూ పసిడి ధర నిలకడగానే ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,990 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,090గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,500గానే ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధరల్లో కూడా ఎలాంటి మార్పూ లేదు. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,340గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,440గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,090 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,090 గా ఉంది.

ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు స్థిరంగానే కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం నేడు రూ.23,110 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.

అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Also Read: Doorstep Banking Services: ఇంటి వద్దకే బ్యాంకు! ఒక్క లావాదేవీకి ఎంత తీసుకుంటారో తెలుసా!

Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్‌ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్‌ కంపెనీకి నష్టాల సెగ!!

Also Read: Budget 2022: టాక్స్‌ పేయర్లకు బడ్జెట్‌ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Jan 2022 06:37 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost Todays silver price platinum price hyderabad gold silver price vijayawada gold rate

ఇవి కూడా చూడండి

JC Prabhakar Reddy: ఆర్టీవో ఆఫీస్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన, వాళ్లు ఎదురొస్తే కాల్చేస్తామని వార్నింగ్!

JC Prabhakar Reddy: ఆర్టీవో ఆఫీస్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన, వాళ్లు ఎదురొస్తే కాల్చేస్తామని వార్నింగ్!

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే  ఏప్రిల్‌లోనే అవకాశం !

Revanth Reddy: వచ్చే వారం విజయవాడకు రేవంత్‌! జగన్‌తో భేటీ అయ్యే ఛాన్స్‌

Revanth Reddy: వచ్చే వారం విజయవాడకు రేవంత్‌! జగన్‌తో భేటీ అయ్యే ఛాన్స్‌

Chandrababu Visits KCR : కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు - ఆరోగ్యంపై ఆరా !

Chandrababu Visits KCR : కేసీఆర్‌ను పరామర్శించిన  చంద్రబాబు - ఆరోగ్యంపై ఆరా    !

Gas Cylinder Guarantee : రూ. 500కే గ్యాస్ సిలిండర్ - అప్పుడే క్యూ కడుతున్న మహిళలు

Gas Cylinder Guarantee :   రూ. 500కే గ్యాస్ సిలిండర్ -  అప్పుడే క్యూ కడుతున్న మహిళలు

టాప్ స్టోరీస్

YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

YSRCP Gajuwaka :  వైసీపీకి  గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Highest Selling Hatchback Cars: నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్‌బాక్‌లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!

Highest Selling Hatchback Cars: నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్‌బాక్‌లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!