By: ABP Desam | Updated at : 13 Jan 2022 01:39 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఇంటి వద్దకే బ్యాంకు సేవలు
Doorstep Banking Services: కొత్త ఏడాదిలోనైనా కరోనా పీడ వదలుద్దేమోనని అంతా ఆశగా ఎదురు చూశారు! ప్రమాదకరమైన డెల్టా, డెల్టా ప్లస్ నుంచి ప్రపంచ భయటపడిందని కాస్త ఆనందించారు. కానీ అంతలోనే ఒమిక్రాన్ సహా మరికొన్ని వేరియెంట్లు వెలుగులోకి వచ్చాయి. ఒకదాన్ని మించి మరొకటి వేగంగా విస్తరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజల వద్దకే పాలన తరహాలో ఇంటి వద్దకే ఆర్థిక సేవలు అన్న నినాదాన్ని బ్యాంకులు ఎత్తుకున్నాయి. పదికి పైగా ఆర్థికేతర సేవలను ఇంటివద్దకే వచ్చి అందిస్తున్నాయి. ఫోన్ నంబర్ ఖాతాకు అనుసంధానమై ఉంటే చాలు. సీనియర్ సిటిజన్లకు ఇదో వరం లాంటిదే!! చెక్‌లు తీసుకెళ్లడం, చెక్‌బుక్‌లు ఇవ్వడం, అకౌంట్ స్టేట్‌మెంట్ ఇవ్వడం, ఫామ్ 15G లేదా ఫామ్ 15H ఇవ్వడం, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించడం వంటి సేవలు అందిస్తున్నాయి. 12 పబ్లిక్ లిస్టెడ్ బ్యాంకుల్లో ఈ సేవలు పొందొచ్చు.
Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!
Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్!
Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్! సర్వీస్ ఛార్జెస్ పెంచేసిన పంజాబ్ బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎస్‌బీఐ కస్టమర్లు ఇంటి వద్దే బ్యాంకు సేవలు పొందొచ్చు. హోమ్‌బ్రాంచ్ నుంచి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆర్థికేతర లావాదేవీలకు ఒక్కో విజిట్‌కు రూ.60, అదనంగా జీఎస్‌టీని వసూలు చేస్తుంది. ఒక ఆర్థిక సేవలైతే ఒక్కో విజిట్‌కు రూ.100, అదనంగా జీఎస్టీ చెల్లించాలి. ఒక ఒక్కో లావాదేవీకి నగదు జమ, నగదు ఉపసంహరణకు రూ.20000 పరిమితి విధించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు
వికలాంగులు, 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు పంజాబ్ నేషనల్ బ్యాంకు దూర బ్యాంకు సేవలు అందిస్తోంది. బ్యాంకు శాఖలకు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉండేవారికే ఈ సౌకర్యం వరిస్తుంది. ఆర్థిక, ఆర్థికేతర సేవలకు ఒక్కో లావాదేవీకి రూ.100, అదనంగా జీఎస్‌టీని పంజాబ్ బ్యాంకు తీసుకుంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
ఈ ప్రైవేటు రంగ బ్యాంకు ఇంటి వద్దకే సేవల్లో భాగంగా నగదు జమ, ఉపసంహరణ పరిమితి రూ.25,000కు పరిమితం చేసింది. కనీస మొత్తం మాత్రం రూ.5000. అయితే నగదు జమ చేసినా, విత్‌డ్రా చేసినా ఒక్కో విజిట్‌కు రూ.200, అదనంగా రుసుములు వసూలు చేస్తుంది. ఇక మరే ఇతర సేవల కోసమే విజిట్ చేస్తే రూ.100 అదనంగా పన్ను తీసుకుంటుంది. సెల్ఫ్ చెక్ రూపంలోనే నగదు తీసుకొనే సౌకర్యం కల్పిస్తోంది.
Also Read: ITR Filing Date Extended: టాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్! మార్చి 15 వరకు గడువు పెంపు
Also Read: Vodafone Idea Shareholders: వొడాఫోన్ ఐడియాలో కేంద్రానికి '36%' వాటా.. 19% నష్టపోయిన షేరు!!
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?