By: ABP Desam | Updated at : 11 Jan 2022 07:02 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఐటీఆర్ ఫైలింగ్
పన్ను చెల్లింపు దారులకు గుడ్‌న్యూస్! ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే గడువును ప్రభుత్వం పొడగించింది. 2021, డిసెంబర్ 31తో ముగిసిన గడువును 2022, మార్చి 15 వరకు పొడగించింది. ఇప్పటి వరకు ఐటీఆర్ సమర్పించని వాళ్లు ఇకపై ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు ఆదాయపన్ను శాఖ ఓ ట్వీట్ చేసింది.
'కొవిడ్-19 మహమ్మారి, ఇతర ఇబ్బందులతో ఐటీ రిటర్నులు దాఖలు చేయలేకపోయామని చాలామంది పన్ను చెల్లింపుదారులు పేర్కొన్నారు. వారి విజ్ఞప్తి మేరకు ఆడిట్ రిపోర్టులు, ఐటీఆర్ అసెస్‌మెంట్ ఇయర్ 21-22 దాఖలు గడువును మరింత పొడగిస్తున్నాం' అని ప్రభుత్వం తెలిపింది. 'అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 ఐటీఆర్ దాఖలు తేదీని 2021, నవంబర్ 30కి, దానిని 2021, డిసెంబర్ 31కి, అట్నుంచి 2022 ఫిబ్రవరి 28కి దానిని 2022, మార్చి 15కు పొడగిస్తున్నాం' అని ఉత్తర్వులు జారీ చేసింది.
On consideration of difficulties reported by taxpayers/stakeholders due to Covid & in e-filing of Audit reports for AY 2021-22 under the IT Act, 1961, CBDT further extends due dates for filing of Audit reports & ITRs for AY 21-22. Circular No. 01/2022 dated 11.01.2022 issued. pic.twitter.com/2Ggata8Bq3
— Income Tax India (@IncomeTaxIndia) January 11, 2022
2021, ఏప్రిల్ 1 నుంచి 2022, జనవరి 3 వరకు 1.48 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ (సీబీడీటీ) రూ.1,50,407 కోట్లకు పైగా రీఫండ్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 1.46 కోట్ల మందికి రూ.51,194 కోట్లు ఇన్‌కం టాక్స్ రీఫండ్స్ జారీ చేయగా 2.19 లక్షల మందికి కార్పొరేట్ టాక్స్ రీఫండ్ రూపంలో రూ.99,213 కోట్లు రీఫండ్ చేసింది.
Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్!
Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!
Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్! సర్వీస్ ఛార్జెస్ పెంచేసిన పంజాబ్ బ్యాంక్
Also Read: Reliance Mandarin Hotel Deal: అమెరికాలో ఫైవ్‌స్టార్ హోటల్ కొనుగోలు చేసిన రిలయన్స్.. ఎంతకో తెలుసా?
Also Read: Anand Mahindra: మహీంద్రా కాకుండా వేరే కార్లున్నాయా? ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం!!
Tax on Petrol, Diesel: పెట్రోల్, డీజిల్పై మరో పన్ను పెంచిన కేంద్రం! సామాన్యుడి పరిస్థితి ఏంటి?
Gold Rate Hike: బంగారం భగ భగ! దిగుమతి పన్ను రెట్టింపు చేసిన కేంద్రం!
Stock Market News: అల్లాడిస్తున్న మార్కెట్లు! ఉదయం 1000 డౌన్.. సాయంత్రానికి 111కు నష్టం!
Toyota Urban Cruiser Hyryder: టొయోటా హైరైడర్ వచ్చేసింది - టాప్ క్లాస్ ఫీచర్లతో - కారు మామూలుగా లేదుగా!
Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.2 లక్షల కోట్లు గాయబ్! నేటి బిట్కాయిన్ ధర ఎంతంటే?
Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్
Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్
Vishal No Politics : కుప్పంలో చంద్రబాబుపై పోటీ - విశాల్ క్లారిటీ ఇదే
Rahgurama : నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా - సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సలహా !