Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత
నేడు సైతం తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చలి తీవ్రత పెరిగింది.
AP Weather Updates: ఏపీ, తెలంగాణలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు సైతం తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో వేగంగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలో చలి తీవ్రత పెరిగింది. కోస్తాంధ్ర, యానాంలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం (పుదుచ్చేరి), పశ్చిమ గోదావరి జిల్లాలలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..
దక్షిణ కోస్తాంధ్రలో సైతం నేడు తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావం తో వానలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేడు సైతం తేలికపాటి జల్లులు కురవనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ ధాన్యం, పంట ఉత్పత్తులను నీటి పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెండు రోజుల తరువాత ఇక్కడ వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వర్షాల ప్రభావంతో చలి గాలులు వీస్తాయి. రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో గత వారం రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నేడు సైతం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్ల వానలు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.
Also Read: Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..
Also Read: Doorstep Banking Services: ఇంటి వద్దకే బ్యాంకు! ఒక్క లావాదేవీకి ఎంత తీసుకుంటారో తెలుసా!
Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్ కంపెనీకి నష్టాల సెగ!!