Nalgonda: ఏడాదిగా సమైఖ్యవాదుల కుట్ర, కేసీఆర్‌ను అడ్డు తొలగించాలని పన్నాగాలు - గుత్తా సంచలన వ్యాఖ్యలు
ఏపీలో చేతకాక తెలంగాణలో ప్రజలను మభ్య పెట్టి కేసీఆర్‌ను అడ్డు తొలగించుకోవాలని రాష్ట్రాన్ని మళ్ళీ కబ్జా చేయడానికి వస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
![Nalgonda: ఏడాదిగా సమైఖ్యవాదుల కుట్ర, కేసీఆర్‌ను అడ్డు తొలగించాలని పన్నాగాలు - గుత్తా సంచలన వ్యాఖ్యలు Gutha Sukender Reddy accuses YS Shamila as adopted person by BJP Nalgonda: ఏడాదిగా సమైఖ్యవాదుల కుట్ర, కేసీఆర్‌ను అడ్డు తొలగించాలని పన్నాగాలు - గుత్తా సంచలన వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/02/f1beb0b1be189a8f4d181717632fd8e41669959877276234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
శాసనమండలి ఛైర్మన్, నల్గొండ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కాలంగా తెలంగాణలో అనుమానకర పరిణామాలు జరుగుతున్నాయని అన్నారు. ఆ పరిణామాల వెనుక సమైఖ్యవాదుల కుట్రలు ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు వారు మూకుమ్మడి దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో చేతకాక తెలంగాణలో ప్రజలను మభ్య పెట్టి కేసీఆర్‌ను అడ్డు తొలగించుకోవాలని రాష్ట్రాన్ని మళ్ళీ కబ్జా చేయడానికి వస్తున్నారని అన్నారు. బీజేపీ దత్త పుత్రిక షర్మిల పాదయాత్రల పేరుతో కేసీఆర్ ను అప్రతిష్ఠ పాలు చేస్తోందని విమర్శించారు. అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా ఐఏఎస్ అధికారులను కూడా జైలుకు పంపిన చరిత్ర వారిదని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
2014లో మోదీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలు ఏపీలో కలిపారని గుర్తు చేశారు. దేశంలో ప్రభుత్వాలను కూల్చేకుట్రలు, అనిశ్చితకరమైన వాతావరణం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)