News
News
X

Bandi Sanjay : సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ మరో సవాల్, ఈసారి సీఎం పదవిపై!

Bandi Sanjay : సీఎం కేసీఆర్ దమ్ముంటే దళితుడిని సీఎంగా చేయాలని బండి సంజయ్ సవాల్ చేశారు.

FOLLOW US: 
 
Bandi Sanjay : మునుగోడు నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... దేశంలోని దళితులందరికీ నరేంద్రమోదీ ఆత్మబంధువు అన్నారు. అంబేద్కర్ భిక్ష వల్లే తాను ప్రధాని అయ్యానని పార్లమెంటు సాక్షిగా చెప్పారన్నారు. తెలంగాణలో కేసీఆర్ దళిత ద్రోహిగా మారారని విమర్శించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందన్నారు. ప్రధాని మోదీ దళితుల గౌరవాన్ని పెంచేందుకు, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు ఎన్నో స్కీంలను తీసుకొచ్చారన్నారు. ఇప్పటిదాకా బ్యాంక్ మెట్లు ఎక్కని దాదాపు 3 కోట్ల మంది దళితులకు బ్యాంకు ఖాతాలు తెరిపించి నేరుగా ఆ నగదు లబ్దిని వారి ఖాతాల్లోనే జమ అయ్యేలా చేశారని బండి సంజయ్ అన్నారు. దళితులు ఉద్యోగాలు అడిగేవాళ్లు కాకూడదు, లైన్లో నిలబడే వాళ్లు కాకూడదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ప్రధాని మోదీ అన్నారన్నారు. అర్హులైన దళితులకు ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.5 కోట్ల వరకు లోన్లు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. 

మునుగోడు యువతకు కోట్ల రూపాయల లోన్లు
 
"మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే స్థానిక యువకులకు కోట్ల రూపాయల లోన్లు ఇప్పించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేడ్కర్ ను దారుణంగా అవమానించింది. దళితుల హక్కుల కోసం పార్లమెంట్ లో ప్రశ్నిస్తే నెహ్రూ కుదరదన్నారు. రాజీనామా చేస్తానని అంబేడ్కర్ హెచ్చరించిండు. అయినా రాజీనామా చేస్తే చేసుకోపో... అని నెహ్రూ అంటే.. తక్షణమే రాజీనామా చేసి బాబాసాహెబ్ ఉప ఎన్నికల్లోకి వెళితే ఎవరో అనామకుడిని నిలబెట్టి ఎన్నో కుట్రలు, కుతంత్రలు చేసి అంబేడ్కర్ ను ఓడించిన దుష్ట చరిత్ర కాంగ్రెస్ దే.  బతికున్నప్పుడు పార్లమెంట్ లో అవమానించారు. ఎన్నికల్లో ఓడించి అవమానించారు. ఆఖరికి చనిపోయిన తరువాత కూడా అంబేడ్కర్ మృతదేహాన్ని ఢిల్లీలో పెడితే అక్కడ స్ర్మృతి స్థలం కట్టాల్సి  వస్తుందని ఆయన భౌతిక కాయాన్ని ముంబయికి పంపించి దారుణంగా అవమానించారు. నరేంద్రమోదీ అంబేడ్కర్ ను దైవంతో సమానంగా చూస్తున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి అంబేడ్కర్ జీవితంతో అనుబంధం ఉన్న 5 స్థలాలను పంచ తీర్థాలుగా అభివృద్ధి చేశారు. ఆయన జ్ఞాపకాలు వందల ఏళ్ల వరకు భవిష్యత్ తరాలకు గుర్తుండాలనే మోదీ ఈ గొప్ప కార్యక్రమాలు తీసుకున్నారు." - బండి సంజయ్ 

దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఏమైంది? 

అంబేడ్కర్ పుట్టిన ఊరు మధ్యప్రదేశ్ లోని ‘‘మావు’’ను గొప్ప స్మారక కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం మార్చిందని బండి సంజయ్ అన్నారు. అంబేడ్కర్ లండన్ లో చదువుకునేటప్పుడు ఉన్న ఇంటిని వందల కోట్లు ఖర్చు పెట్టి మ్యూజియంగా మార్చారని గుర్తుచేశారు. నాగ్ పూర్ లోని అంబేడ్కర్ దీక్షా స్థల్ ను గొప్పగా తీర్చిదిద్దారన్నారు. ముంబయిలో అంబేడ్కర్ ఘాట్ ను గొప్ప స్ర్మృతి స్థల్ గా తీర్చిదిద్దారని తెలిపారు. దిల్లీలో అతిపెద్ద అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ను ఏర్పాటు చేశారన్నారు.  ప్రధాని మోదీ ఈ ఐదు పంచ్ తీర్థాలను దివ్య క్షేత్రలుగా రూపొందించి భావితరాలకు ఆదర్శంగా నిలిపారన్నారు.  తెలంగాణలో  కేసీఆర్ అడుగడుగునా బాబాసాహెబ్ ను అవమానిస్తూనే ఉన్నారని ఆరోపించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరగరాయాలని కేసీఆర్ కోరారన్నారు.  ఎందుకంటే దళితుడి పేరును పదేపదే ఉచ్చరించడం ఇష్టంలేక కల్వకుంట్ల రాజ్యాంగం రాస్తానంటున్నారని విమర్శించారు.  అన్నింటికి మించి సీఎంఓలో దళిత అధికారులను దగ్గరకు కూడా రానీయ్యలేదన్నారు. గొప్ప ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తీరని అవమానం చేశారని బండి సంజయ్ ఆరోపించారు.  కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులిచ్చి కారణాలు చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఆరోపించారు. దళితులకు మూడెకరాలు.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు, ఎస్సీ కార్పొరేషన్ కు నిధులివ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ మొదటి కేబినెట్ లో ఎంతమంది దళితులకు అవకాశమిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.  కేసీఆర్ దమ్ముంటే దళితుడిని సీఎంగా చేయాలన్నారు. కొత్త సెక్రటేరియట్ లో కొత్త ఛైర్ లో దళితుడిని సీఎంగా కూర్చోబెట్టాలని సవాల్ చేశారు.  

News Reels

Published at : 29 Oct 2022 04:50 PM (IST) Tags: BJP Bandi Sanjay CM KCR Munugode Bypoll Dalit CM

సంబంధిత కథనాలు

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

KCR Vs Goverer : బెంగాల్, కేరళ సీఎంల బాటలో కేసీఆర్ - గవర్నర్‌కు ఆ హోదా కట్ చేయడం ఖాయం ! వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు

KCR Vs Goverer :  బెంగాల్, కేరళ సీఎంల బాటలో కేసీఆర్ - గవర్నర్‌కు ఆ హోదా కట్ చేయడం ఖాయం ! వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు

Gold ATM : ఈ ఏటీఎంలో బంగారం వస్తుంది, దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో!

Gold ATM : ఈ ఏటీఎంలో బంగారం వస్తుంది, దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో!

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

టాప్ స్టోరీస్

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

బుధవారం నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్ - కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ వ్యూహాలివే

బుధవారం నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్ - కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ వ్యూహాలివే