అన్వేషించండి
Advertisement
Ms & Mrs Telangana Divas : హైదరాబాద్ లో మిస్ అండ్ మిస్సెస్ తెలంగాణ దివాస్ బ్యూటీ కాంటెస్ట్ , విజేతలు వీరే!
Ms & Mrs Telangana Divas : హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మిస్ అండ్ మిస్సెస్ తెలంగాణ దివాస్ బ్యూటీ కాంటెస్ట్ జరిగింది. ఐదు విభాగాల్లో జరిగిన పోటీల్లో ఆదివారం విజేతలను ప్రకటించారు.
Ms & Mrs Telangana Divas : హైదరాబాద్ లోని మసబ్ ట్యాంక్ లోని ఓ ప్రైవేట్ హోటల్ Ms & Mrs Telangana Divas బ్యూటీ కాంటెస్ట్ జరిగింది. ఐదు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో 13 నుంచి 65 ఏళ్ల మహిళలు పాల్గొన్నారు. వేర్వేరు టాస్కుల్లో ప్రతిభ చూపిన మహిళలను జడ్జిలు ఐదు విభాగాల్లో విజేతలకు ప్రకటించారు. మొత్తం 23 మంది ఫైనలిస్ట్ పోటీ పడగా ఆదివారం విజేతలను ప్రకటించారు.
విజేతలు
- దీప్తి, మిసెస్ తెలంగాణ దివాస్ 2022
- ఆశ ఆనంద్, మిసెస్ తెలంగాణ (క్లాసిక్ విభాగం) దివాస్ 2022
- అంత్రా సేన్, మిస్ తెలంగాణ దివాస్ 2022
- ఫరిదా మిస్ తెలంగాణ(సింగిల్ మదర్స్, డివోర్స్) దివాస్ 2022
- రుబీనా, మిస్ టీన్ తెలంగాణ 2022
ఇన్నర్ బ్యూటీకి ప్రాధాన్యత - ఫరిదా
" చాలా బాగా జరిగింది. ఆడియన్స్ ను ఎలా ఫేస్ చేయాలి అనేది నేర్చుకున్నాం. నా ఉద్దేశంలో అందం అనేది మనిషి లోపల ఉంటుంది. బయటకు కనిపించే బ్యూటీ కన్నా ఇన్నర్ బ్యూటీ చాలా ముఖ్యం. నేను ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇక్కడ ఇదే హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి అన్న నిబంధనలు ఏంలేవు. అవుటర్ బ్యూటీ కన్నా మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం అనే దానికే ప్రాధాన్యత ఇస్తారు. "
-- ఫరిదా, మిస్ తెంలగాణ దివాస్ విన్నర్( సింగిల్ మదర్, డివోర్సీ విభాగం)
ఎదుటివారిని ఎలా మోటివేట్ చేయాలో నేర్చుకున్నా-దీప్తి
" వరంగల్ కు చెందిన దీప్తి 2022 మిస్సెస్ తెలంగాణ దివాస్ గా ఎంపికయ్యారు. క్యాట్ వాక్ ఎలా చేయాలి. ఆడియాన్స్ కు నా టాలెంట్ చూపించడానికి ఇక్కడ అవకాశం ఉంది. డాన్స్, సింగింగ్ రౌండ్స్ ఉన్నాయి. డైట్ మెయింట్ నెస్స్ కూడా చూడాలి. ఏ ఉమెన్ ఏ విధంగా , ఎలా ఎదుటి వారిని మోటివేట్ చేయాలి అనేది నేర్చుకున్నాను. అందుకే నేను ఈ క్రౌన్ గెలుచుకున్నాను. అందుకు నేను నివేదిక మేడమ్ ధన్యవాదాలు చెప్పుకోవాలి. అందరూ నాకు చాలా సపోర్టు చేశారు. "
-- దీప్తి, వరంగల్
Also read: ముద్దుల తమ్ముడికి అయిదు కిలోల లెటర్ రాసిన అక్క, ఇదో వరల్డ్ రికార్డు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement