MLC Election: వారికి విమానాలు.. మాకు బస్సులా.. ఖమ్మం టీఆర్‌ఎస్ పార్టీలో విభేదాలు
ఎమ్మెల్సీ ఎన్నికల సిత్రాలు రసవత్తరంగా మారుతున్నాయి.. వర్గపోరు కారణంగా కొందరికి బుజ్జగింపుల పర్వం కొనసాగుతుండగా మరోవైపు క్యాంపులకు వెళ్లే విషయంలో మరికొందరు అలకపాన్పు వీడటం లేదని తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో గుబులు పుట్టిస్తోంది. ఇన్నాళ్లూ ఐక్య గళం వినిపించినా స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎన్నికలు పార్టీలో ఉన్న విభేదాలు బహిర్గతం చేస్తున్నాయి. బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాదించేందుకు అవసరమైన పూర్తి ఓటింగ్ ఉనప్పటికీ వర్గ విభేదాలు ఇబ్బందిగా మారాయి. ఎంత మంది ఓటర్లు పార్టీకి అనుకూలంగా ఉంటారనే విషయంపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు తెరదించేందుకు పార్టీ నాయకులు ఓటర్లను క్యాంపులకు తరలించాలని నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా ఓటర్లను బెంగుళూరు, గోవా సహా వివిధ ప్రాంతాలకు తరలించేందుకు సిద్దమయ్యారు. అయితే ఓటర్ల తరలింపు విషయంలో ఇప్పుడు వివాదం నెలకొనట్లు తెలుస్తోంది.
Also Read: ప్రభాస్, పూజా హెగ్డే లవ్ కెమిస్ట్రీ చూశారా?
వారికి విమనాలు.. మాకు బస్సులా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన ఓటర్లను గోవా, బెంగుళూరు తరలించేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన కొంతమంది ఓటర్లను గోవా పంపారు. అయితే వీరిని ఎయిర్‌బస్ ద్వారా గోవాకు తరలించడం, కొంత మంది ఎంపీటీసీలను బస్సుల ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తుండటంతో అసలు వివాదం మొదలైంది. అందరం ఓటర్లమే అయినప్పుడు ఒకరిని విమానాల ద్వారా తరలించి మిగిలిన వారిని బస్సుల ద్వారా తరలించడమేమిటని వైరా నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీలు అలకపాన్పు ఎక్కినట్లు తెలుస్తోంది. కాగా కరోనా నేపథ్యంలో విమానాల ద్వారా తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తాము బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వారిని సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికలు రోజుకో ట్విస్టును చూపుతున్నాయి.
Read Also: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు
Read Also: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
Read Also: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...
Read Also: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి