Ministry of Civil Aviation: ఏపీ, తెలంగాణలో డ్రోన్ల వినియోగానికి అనుమతి.. ఇంతకీ ఎందుకోసమంటే?
కేంద్ర పౌరవిమానయానశాఖ దేశంలోని పది సంస్థలకు డ్రోన్ల వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది.
కేంద్ర పౌరవిమానయానశాఖ దేశంలోని పది సంస్థలకు డ్రోన్ల వినియోగానికి అనుమతి ఇచ్చింది. అందులో హైదరాబాద్‌లోని ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ ఉంది. డ్రోన్లను ఉపయోగించి రిమోట్ పైలట్ ట్రైనింగ్ కొనసాగించడం కోసం ఈ సంస్థకు అనుమతిఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది. బెంగళూరులో పట్టణ ఆస్తి యాజమాన్య హక్కుల రికార్డుల నమోదుకు డ్రోన్ ఆధారిత సర్వే నిర్వహించడానికి కర్ణాటక ప్రభుత్వానికీ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వరి, మిరియాల పంటపై స్పెయింగ్ కోసం డ్రోన్లను ఉపయోగించడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చింది.
గుజరాత్ లోని బ్లూ రే ఏవియేషన్, తెలంగాణలోని ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ సంస్థల్లో డ్రోన్లను ఉపయోగించి రిమోట్ పైలట్ శిక్షణ ఇవ్వనున్నారు.
బేయర్ క్రాప్ సైన్స్ సంస్థకు 'డ్రోన్ ఆధారిత వ్యవసాయ పరిశోధన కార్యకలాపాలు' నిర్వహించడానికి, పంటలపై స్ప్రే చేసేందుకు డ్రోన్లను ఉపయోగించేందుకు అనుమతి దొరికింది.
ముంబైలోని నేషనల్ హెల్త్ మిషన్ మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని జవహర్ గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగానికి అనుమతి లభించింది. అవసరమైన హెల్త్ కేర్ ఐటమ్స్ ను డ్రోన్ల ద్వారా అందించనున్నారు.
గ్యాంగ్‌టాక్ స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్.. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కోసం డ్రోన్ ఆధారిత ఏరియల్ సర్వే చేయనుంది. దీనికోసం డ్రోన్ల వినియోగానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి లభించింది.
పశ్చిమ బెంగాల్‌లోని బర్న్‌పూర్‌లోని స్టీల్ ప్లాంట్‌పై నిఘా కోసం డ్రోన్లను వినియోగించనున్నారు. ఈ మేరకు SAIL అనుమతి పొందింది.
చెన్నైకి చెందిన ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ కంపనీ పంట సస్య రక్షణ చర్యలకు, పంట తెగుళ్లను ముందుగా అంచనా వేసందుకు అనుమతి పొందింది. అలాగే.. 'డ్రోన్ ఆధారిత ఏరియల్ స్ప్రేయింగ్' కూడా చేయనుంది.
దేశంలోని ఐదు వేర్వేరు ప్రదేశాలలో వాతావరణంపై పూణేకి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మిటియరాలజీ పరిశోధన చేయనుంది. ఈ మేరకు కేంద్ర పారయాన శాఖ అనుమతినిచ్చింది.
మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ (UAS) రూల్స్ 2021, ప్రకారం పది సంస్థలకు షరతులతో కూడిన అనుమతి ఉంటుంది. ట్రయల్స్ కు ఆమోదం పొందిన తేదీ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చెల్లుబాటు అవుతుంది.
Also Read: Diabetes Skin problems: చర్మం ఇలా మారుతుందా? జాగ్రత్త, అది డయాబెటిస్ వల్ల కావచ్చు!