Gold Rate: పసిడి ధర పరుగులు.. పుత్తడి రేటు జిగేల్.. ఇవన్నీ సరే.. ఇంతకీ బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు?
బంగారం.. ఓ సింగారం.. ఆచారం.. అవసరం.. ఫ్యాషన్ పేరు ఏదైనా.. బంగారమంటే ప్రత్యేక స్థానం. కానీ ఈ బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.
పసిడి ధర కొండెక్కింది.. దివినుంచి భువికి దిగిరాను అంటోంది... జిగేల్ అన్న బంగారం ధర అని వార్తలు చూస్తూనే ఉంటాం. ఇంట్లో ఏ శుభకార్యమైనా.. బంగారం కొనాల్సిందే. ఆచారంలో ఓ భాగమైపోయింది.. విలువైన సంపద బంగారం... ఏదైనా విశిష్టతకి కొలమానంగా బంగారం అనే పదం వాడుతుంటాం.. బంగారంలాంటి మాట చెప్పావ్ అని.. బంగారం లాంటి వ్యక్తి అనో.. ఇలా మంచితనాన్నో, మనిషిలోని మంచి గుణాలను తెలియచెప్పడానికో బంగారం అనే పదం ప్రామాణికంగా కూడా వినిపిస్తుంటుంది. కానీ దాని విలువ ఎవరు నిర్ణయిస్తారో అర్థం కాదు. అసలు బంగారానికి విలువ నిర్ణయించే వ్యవస్థ ఏదైనా ఉందా? ఈ బంగారం విలువైన లోహంగా ఎందుకు మారింది?
భద్రత కావాలనుకునేవారికి బంగారమే పెట్టుబడి
పెట్టుబడులకు స్థిరాస్తి, స్టాక్ మార్కెట్లు, డిపాజిట్లు ఇలాంటి మార్గాలు ఉంటాయి. కానీ కొన్ని రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడతారు. భద్రత కావాలనుకునేవారు బంగారాన్ని పెట్టుబడికి మార్గంగా ఎన్నుకుంటారు. ఎందుకో తెలుసా ఏది పడిపోయినా బంగారం ధర అనేది మరీ.. దారుణంగా అయితే పడిపోదనే నమ్మకం. ఫిక్స్‌డ్ డిపాజిట్, ప్రావిడెంట్ ఫండ్‌ల వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో ప్రస్తుతం పెట్టుబడులకు మంచి అవకాశంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు.
Also Read: Zodiac Signs: ఈ రాశులవారి ఆలోచనలు డబ్బుచుట్టూనే తిరుగుతాయ్…డబ్బు-పరపతి చూశాకే ప్రేమలో పడతారు…
కరెన్సీ తర్వాత..
మనం ఎక్కువగా సంపదను కరెన్సీలోనే కొలుస్తాం. దాని తర్వాత ఎక్కువగా పోల్చేది బంగారమే. ఇప్పుడు కాదు.. ఏళ్ల నుంచి బంగారాని ప్రత్యేకత ఉంది. ఇప్పుడంటే బంగారాన్ని బయటకు తీసి.. శుద్ధి చేయడం సులభమే. కానీ టెక్నాలజీ లేని రోజుల్లో బంగారాన్ని బయటకు తీసి.. శుద్ధి చేయాలంటే.. చాలా కష్టమయ్యేది. బంగారాన్ని ఎన్నాళ్లు దాచినా.. తుప్పు పట్టదు, బరువు తగ్గద్దు, ఎలాంటి మార్పు ఉండదు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఈ కారణంగా లోహాల్లోకెల్లా బంగారానికి విశేషమైన స్థానం వచ్చింది.
Also Read: లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోయింది.. ఒక్క రాత్రిలో రూ.437 కోట్లకు అధిపతి అయ్యాడు!
సమస్యల్లో ఉన్నప్పుడు గుర్తొచ్చేది పసిడి
మనకు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, చేతిలో డబ్బులు లేనప్పుడు.. వెంటనే మనకు గుర్తొచ్చేది బంగారమే. తాకట్టు పెట్టైనా.. అరగంటలో అప్పు తీసుకోవచ్చు. వీలైతే మార్కెట్ రేటుకు అమ్ముకోవచ్చు. స్థిరాస్తుల్లాంటి పెట్టుబడులను నగదుగా మార్చుకోవాలంటే సమయం పడుతుంది. సరైన ధర వచ్చే వరకూ చూడాలి. భూమిని, ఇంటిని తాకట్టు పెట్టాలన్నా.. చాలా కష్టాలు పడాలి. ఎన్నో పత్రాలు కావాలి. కొన్నిసార్లు అవసరం ఎక్కువగా ఉంటే.. తక్కువ ధరకే అమ్ముకోవాలి. కానీ బంగారం అలా కాదు. బంగారాన్ని ఆభరణాల రూపంలో కంటే బాండ్ల రూపంలో కొనడమే మంచిది. ఆభరణాలను మార్చుకునేటప్పుడు తరుగు, తయారీ ఛార్జీలు ఉంటాయి. అదే బాండ్లయితే, వాటిమీద వడ్డీ కూడా లభిస్తుంది. మెచ్యురిటీ తేదీనాటికి మార్కెట్‌లో ఉన్న విలువ ప్రకారం డబ్బు లెక్కగట్టి ఇస్తారు.
బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు...?
ఎక్కువ మంది బంగారం ధరను.. ఆర్‌బీఐ, అంతర్జాతీయ సంస్థలు కాలానుగుణంగా నిర్ణయిస్తాయేమో అని అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. పసిడి ధరను ఎవరూ నిర్ణయించారు. ఉదాహరణకు కొవిడ్ లాక్‌డౌన్ వచ్చిపడ్డాక ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పరుగులు పెట్టాయి. ఆర్థిక పరిస్థితులు అటుఇటుగా ఉండటంతో మదుపరులు బంగారంలో పెట్టుబడులు పెట్టారు. ఈ కారణంగా డిమాండ్ పెరిగింది. ఆటోమేటిక్ గా బంగారం ధర కూడా పెరిగిందంటారు నిపుణులు.
బంగారాన్ని బయటకు తీసి.. శుద్ధి చేసేందుకు అయ్యే ఖర్చు, శ్రమ, సమయాన్ని బట్టి దాని ధర నిర్ణయిస్తారు. కానీ బంగారం నిల్వలు తక్కువగా ఉండి, పసిడి కోసం ప్రజల నుంచి వచ్చే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఉత్పత్తి చేసేందుకు అయిన వ్యయం కంటే చాలా ఎక్కువ ధర పలుకుతుంది.
Also Read: Kabul Airport: కాబుల్ ఎయిర్ పోర్టులో కిక్కిరిసిన ప్రయాణికులు... ఎయిర్ పోర్టులో తొక్కిసలాట